NV Ramana
NV Ramana: సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు పదవీ విమరణ చేయనున్నారు. సుప్రింకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన విశేష సేవలు అందించారు. జస్టిస్ కోకా సుబ్బారావు తర్వాత సుదీర్ఘకాలం సుప్రింకోర్టు సీజేఐగా రమణ సేవలు అందించారు. 2021 ఏప్రిల్ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. న్యాయవాది నుంచి మొదలు సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు ఎన్వీ రమణ అంచెలంచెలుగా ఎదిగారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2014 ఫిబ్రవరి 17 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. సిజేఐ గా కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన, జడ్జీల నియామకంపై ఎన్వీ రమణ ప్రధానంగా దృష్టిసారించారు. ఈయన హయాంలో 224 మంది హై కోర్టు న్యాయమూర్తుల నియామకం జరగడం గమనార్హం.
CJI NV Ramana : న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం : ఎన్వీ రమణ
ఇదిలాఉంటే జస్టిస్ ఎన్వీ రమణ నేడు సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీవిరమణ చేయనుండగా, రేపు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. రాష్ట్రపతి భవన్‍లో జస్టిస్ యూయూ లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు. యూయూ లలిత్ పేరును తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది.
నేడు పదవీ విరమణకు ముందు భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్‌వి రమణ ఐదు కేసులపై తీర్పులు వెలువరించనున్నారు. ‘ఎన్నికల ఉచితాలు’, 2007 గోరఖ్‌పూర్ అల్లర్ల కేసు, కర్ణాటక మైనింగ్‌పై నిషేధం కోరుతూ దాఖలైన పిఐఎల్ కేసు, రాజస్థాన్ మైనింగ్ లీజు సమస్య, దివాలా చట్టం కింద లిక్విడేషన్ నిబంధనలు. అయితే ఎన్వీ రమణ సీజేఐగా నియమితులైన జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ హిమా కోహ్లితో బెంచ్‌ను పంచుకుంటారు. సుప్రింకోర్టు తొలిసారిగా కోర్టు ప్రోసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. సుప్రీంకోర్టు చరిత్రలో ఇది కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఉదయం 10.30 గంటల నుండి NIC (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) వెబ్‌కాస్ట్ పోర్టల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయని సుప్రీంకోర్టు నోటీసులో పేర్కొంది.
For the first time in the Supreme Court, the proceedings of the ceremonial bench in the Chief Justice of India NV Ramana's court will be live streamed.
On the last working day, CJI Ramana will share the bench with CJI-designate Justice UU Lalit & Justice Hima Kohli at 10.30 am. pic.twitter.com/wwaFXVspDU
— ANI (@ANI) August 26, 2022