CJP Protest In Delhi : సీజేపీ చలో పార్లమెంట్ ఉద్రిక్తత.. లాఠీఛార్జ్.. అమిత్ షాతో మంత్రి ధర్మేంద్ర భేటీ..
CJP Protest In Delhi : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చలో పార్లమెంట్‌కు ఉద్రిక్తంగా మారింది.
- Harish Thanniru
- Published on- July 20, 2026 / 02:15 PM IST
CJP Protest In Delhi
CJP Protest In Delhi : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సీజేపీ చలో సంసద్ మార్చ్‌తో పార్లమెంట్ పరిసరాలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి.
Also Read: Usha Vance : మగ బిడ్డకు జన్మనిచ్చిన ఉషా వాన్స్.. పేరేంటో తెలుసా? భారత్‌తో లింక్ ఉందా..
పార్లమెంట్ ముట్టడికి జంతర్ మంతర్ నుంచి నిరసన కారులు ర్యాలీగా బయలుదేరారు. అనుమతి లేదని పోలీసులు చెప్పినప్పటికీ ర్యాలీ చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించడంతో ఘర్షణ చోటు చేసుకుంది. నిరసనకారులపై పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేశారు. పలువురు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.
సీజేపీ నిరసన, భారీభద్రతా ఏర్పాట్ల కారణంగా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు, సిబ్బందిసైతం రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. నిరసన నేపథ్యంలో పార్లమెంట్, జంతర్‌మంతర్, ఇతర కీలక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. భద్రతా కారణాలతో రాజీవ్ చౌక్, జనపథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ్ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.
And it has finally begun.
Security personnel using lathicharge to disperse crowd at CJP protest in Delhi. pic.twitter.com/JYTNKLq0Tj
— Piyush Rai (@Benarasiyaa) July 20, 2026
సీజేపీ నిరసనల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నీట్ సహా పోటీ పరీక్షల్లో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలన్న లక్ష్యంతో ఉద్యమం చేపట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. మంత్రి దర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని నిరసనకారులు పట్టుబడుతున్నారు. ఈ నేఫథ్యంలో అమిత్ షాతో ఆయన భేటీ కావటంపై చర్చనీయాంశంగా మారింది.
