స్వీపర్ గా చేసి….అదే స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా

  • Publish Date - March 18, 2020 / 10:40 AM IST

కేరళాలోని కన్హాన్‌గడ్‌లో Linza RJ (39)అనే మహిళ 12సంవత్సరాలపాటు ఇక్బాల్‌ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో స్వీపర్ గా, అటెండర్‌గా పనిచేసి.. ఇప్పుడు అదే స్కూల్లో 6వ తరగతి పిల్లలకు ఇంగ్లీష్ చెబుతోంది. ఈమెను చూసి.. ఆ స్కూల్ ప్రిన్సిపల్ Praveena MV చాలా ఇంప్రెస్ అయింది. అంతేకాదు ఈమెకి ఉన్న టాలెంట్ చూస్తుంటే.. చిన్నగా ఇదే స్కూల్‌కి ప్రిన్సిపల్ గా వచ్చి నా పోస్టును కొట్టేస్తుందేమో అని నవ్వుతూ అన్నారు. 

వివరాలు.. Linza బ్యాచిలర్ డిగ్రీ కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు ఆమె తండ్రి రాజన్ కెకె (2001)లో మరణించారు. తండ్రి మరణించడంతో అతని స్థానంలో ఆమెకు ఏదైన ఉద్యోగాం ఇవ్వాలి కాబట్టి… అప్పుడు ఆమెకున్న విద్యార్హతను బట్టి ఖాళీగా ఉన్న స్వీపర్ పోస్టు ఇచ్చారు. అది కూడా ఆ పోస్టులో ఉన్న వ్యక్తి సెలవు పెట్టాడని ఇచ్చారు. వెంటనే ఆమెకు నేనేంటి.. ఈ ఉద్యోగం చేయడమేంటి అనుకుంది.

కానీ, అప్పుడు Linza తమ్ముడు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. వాడిని చదివించాలి అంటే ఆమె ఏదోక పని చేయాల్సిందే. దీంతో కుటుంబాన్నీ పోషించేందుకు Linza ఆలోచించకుండా స్వీపర్‌గా చేరిపోయింది. అయితే ఆ సెలవు పెట్టిన వ్యక్తి 2006 తిరిగొచ్చారు. దాంతో ఆమె పోస్టు పోయింది. తర్వాత కొన్ని రోజులకు అదే పాఠశాల నుంచి మళ్లీ స్వీపర్ పోస్టుకు రమ్మని పిలిచారు. వెంటనే వెళ్లి ఉద్యోగంలో జాయిన్ అయ్యింది. 

ఉద్యోగం చేస్తూనే టీచర్స్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ రాసి, పాస్‌ అయ్యింది. స్టేట్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ కూడా రాయమని ప్రధానోపాధ్యాయురాలు ప్రవీణ ప్రోత్సహించారు. కానీ, అప్పటికే ఆమెకు ఆరేళ్ల కొడుకు, నెలల వయసున్న కూతురు ఉన్నారు. వారిద్దర్నీ చూసుకోవాలి. టెస్ట్‌కు ప్రిపేర్‌ అవడం నా వల్ల కాదు మేడమ్‌ అని చెప్పేసింది. ప్రధానోపాధ్యాయురాలు వెంటనే వాళ్లిద్దర్ని స్కూల్‌కి పంపించూ నేను చూసుకుంటా, నువ్వు ప్రిపేర్‌ అవు అంటూ ధైర్యాన్ని ఇచ్చింది ప్రవీణ. ఇక వెంటనే స్టేట్‌ టెస్ట్‌ కూడా పూర్తి చేసి టీచర్‌గా అదే స్కూల్‌లో పోస్టింగ్‌ సంపాధించుకుంది Linza.

Also Read | వైష్ణోదేవి యాత్ర నిలిపివేత