Delhi CM Arvind Kejriwal
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న సమయంలో కేజ్రీవాల్ ఈ వ్యాక్యలు చేశారు. ప్రజల ఆశీస్సులతో బీజేపీ కుట్రలన్నింటిని ఎదుర్కొనే శక్తి మాకు ఉంది. ప్రజల కోసం మా ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తోందని అన్నారు. మేము బీజేపీ ముందు తలవంచము, వెనక్కు తగ్గము, అమ్ముడు పోమని కేజ్రీవాల్ చెప్పారు. ‘డబ్బుకి అధికారం.. అధికారం డబ్బుకి’ అనే గేమ్ లో భాగం కావడానికి నేను రాజకీయాల్లో రాలేదు. న్యాయస్థానం నుంచి నాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రజా న్వాయస్థానం నాకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది.. ఢిల్లీ ప్రజల ఆదేశాల మేరకు మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీపై కుర్చుంటాను అని కేజ్రీవాల్ అన్నారు.
Also Read : Roja : ఏపీ ప్రభుత్వంపై రోజా విమర్శలు.. వాటిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో రాజీ పడేదే లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. బీజేపీ కంటే ఢిల్లీ ప్రజలే నాకు ముఖ్యం. నేను అగ్ని పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాను.. మళ్లీ ప్రజల్లోకి వెళ్తాను. నా భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు పదవిలో ఉండనని చెప్పారు. ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడే తమతో ఉండి ముందుకు నడిపించాడు. దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతామన్నారు. త్వరలోనే కొత్త సీఎంను ప్రకటిస్తామని, అయితే, సిసోడియా సీఎంగా ఉండరని కేజ్రీవాల్ చెప్పారు. తదుపరి సీఎంను ఎన్నుకునేందుకు శాసనసభా పక్ష సమావేశం జరనుందని, ఇందులో సీఎం అభ్యర్ధి పేరుపై నిర్ణయం తీసుకోనున్నామని కేజ్రీవాల్ చెప్పారు.
Also Read : నాకు ఒక గంట సమయం చాలు.. మద్య నిషేధంపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి. అయితే, వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్నదే నా డిమాండ్. నవంబర్ నెలలో మహారాష్ట్రతోపాటు ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ అన్నారు. ఇదిలాఉంటే.. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కేజ్రీవాల్ జైలుకెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు ఆరు నెలలగా జైల్లోనే ఉన్నారు. అయితే, ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం జైలు నుంచి బయటకు వచ్చారు.