Roja : ఏపీ ప్రభుత్వంపై రోజా విమర్శలు.. వాటిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ఈర్ష, ద్వేషంతో సీఎం చంద్రబాబు నాయుడు ఇలా మన రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్ ను ..

Roja : ఏపీ ప్రభుత్వంపై రోజా విమర్శలు.. వాటిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్

RK Roja

Updated On : September 15, 2024 / 12:27 PM IST

YCP Leader RK Roja : ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మెడికల్ కళాశాలలను ప్రయివేటుపరం చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణం అన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలకు సీట్లు కేటాయించినా.. వాటిని రద్దు చెయ్యమని సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎన్ఎంసీకి లేఖ రాయడం దుర్మార్గమైన చర్య అని రోజా పేర్కొన్నారు. చంద్రబాబు తన పాలనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకురాలేదు. జగనన్న ప్రభుత్వ గతంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రయివేటుపరం చేయాలనుకోవడం క్షమించరాని నేరం అని రోజా అన్నారు.

Also Read : రూటు మార్చిన గంజాయి స్మగ్లర్లు.. పుష్పా సినిమా సీన్లను తలదన్నేలా ఖతర్నాక్ ప్లాన్లు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ఈర్ష, ద్వేషంతో సీఎం చంద్రబాబు నాయుడు ఇలా మన రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్ ను నాశనం చేయాలనుకోవడం సరియైన విధానం కాదని రోజా అన్నారు. ప్రతిభ గల పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగనన్న పాలనలో నిర్మాణం చేపట్టిన మెడికల్ కళాశాలలు అన్నీ ప్రభుత్వమే నిర్వహించాలని రోజా డిమాండ్ చేశారు.