పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ దెయ్యం..ఆమెకు రాముడంటే చచ్చేంత భయం అంటూ బెంగాల్ బీజేపీ మహిళా నాయకురాలు రాజ్ కుమారి కేషారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దీదీపై బీజేపీ నాయకురాలు వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పౌరసత్వ సవరణ చట్టం-2019 మద్ధతుగా బంకురా పట్టణంలో ఆదివారం (డిసెంబర్ 29) జరిగిన ర్యాలీలో రాజ్ కుమారి మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘‘సీఎం మమతాబెనర్జీ ఓ దయ్యం…ఆమెకు రాముడి పేరు ఎప్పుడు వినిపింస్తుందో..ఎక్కడ వినిపిస్తుందోనని ఆమె భయపడిపోతుంటారనీ..ఆ భయంతోనే మమతా కారులోనుంచి బయటకు వచ్చి ప్రజలకు సవాలు విసురుతోంది…రాముడికి భయపడే దెయ్య మమతా’’ అని రాజ్ కుమారి ఆరోపించారు. మమతాబెనర్జీకి సీఎంగా పనిచేసే అర్హత లేదని రాజ్ కుమారి తీవ్ర విమర్శలు చేశారు. ఆమెకు అసలు పరువేలేదనీ పిచ్చి పిచ్చి నిర్ణయాలతో ఆమెను పరువును పోగొట్టుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాజ్ కుమారి.
భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి మతపరమైన హింస నుండి పారిపోతున్న హిందువులు, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు మరియు క్రైస్తవులకు పౌరసత్వం ఇచ్చే పౌరసత్వం (సవరణ) చట్టం 2019 పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి.
సీఎం మమతా బెనర్జీ కూడా ఈ చట్టన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నా ప్రాణం ఉండగా ఈ చట్టాన్ని అమలు కానివ్వను అంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెంగాల్ లో ప్రజలు నిరసనకు ఆమె మద్దతునిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ మహిళా నేత మమతా బెనర్జీపై రాజ్ కుమారి కేషారి సంచలన వ్యాఖ్యలు చేశారు.