CM Stalin : అసెంబ్లీలో భోజనశాల క్లోజ్, ఎమ్మెల్యేలు టిఫిన్ బాక్స్ తెచ్చుకోవాల్సిందే!

శాసనసభా ప్రాంగణంలో ఉండే భోజనశాల మూసివేయాలని ఆదేశించారు. ఇక నుంచి అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు వారి వారి ఇంటి నుంచే భోజనాలు తీసుకరావాలని సూచించారు.

CM Stalin Sensational Decision : అధికారంలోకి వచ్చిన తర్వాత..సంచలన నిర్ణయాలు తీసుకుంటూ..ముందుకెళుతున్న ముఖ్యమంత్రుల్లో సీఎం స్టాలిన్ ఒకరు. ప్రజల సంక్షేమం కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా ఉండాలని ఆయన కాన్వాయ్ సంఖ్యను తగ్గించేశారు. ఈ నిర్ణయంతో పాటు..ఇతర కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళుతున్నారు. తాజాగా..మరో నిర్ణయం తీసుకున్నారు. శాసనసభా ప్రాంగణంలో ఉండే భోజనశాల మూసివేయాలని ఆదేశించారు. ఇక నుంచి అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు వారి వారి ఇంటి నుంచే భోజనాలు తీసుకరావాలని..ఇందులో రాష్ట్ర మంత్రులు కూడా ఉంటారన్నారు.

Read More : Niloufer : రూ. 100 కోసం ఆక్సిజన్ తీసేశాడు..చిన్నారి బలి, నీలోఫర్‌లో దారుణం

శాసనసభా సమావేశాలు జరిగే సమయంలో…పొగడ్తలు వద్దని..ప్రజా సమస్యలపై చర్చించాలని సమయాన్ని వృథా చేస్తే చర్యలు తీసుకుంటామని సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు స్టాలిన్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజా సంక్షేమం కోసం స్టాలిన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ..ప్రజాదరణ పొందుతున్నారు. తమిళనాడు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. సీఎంలకు ఈయన రోల్ మోడల్ గా నిలుస్తున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More : MRP On Alcohol: మందుబాటిల్స్ ఎమ్మార్పీ ధరలపై 10శాతం ఎక్స్‌ట్రా చెల్లించాల్సిందే..

రాజకీయ, వ్యక్తిగత కక్ష సాధింపులకు స్టాలిన్ దూరంగా ఉంటున్నారు. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ..ప్రతిపక్ష నేతలను కూడా కలుపుకపోతుండడం విశేషం. కోవిడ్ టాస్క్ ఫోర్స్ లో ప్రతిపక్ష నేతకు చోటు ఇవ్వడమే ఇందుకు ఉదహారణ. అనాడీఎంకే నెలకొల్పిన అమ్మ క్యాంటీన్లను కొనసాగించారు. గత ప్రభుత్వం జయలలిత, పళనిస్వామి బొమ్మలతో ముద్రించిన స్కూల్ బ్యాగులను వృథా చేయకుండా.. వాటిని పంపిణీ చేయాలని స్టాలిన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త ఒరవడిని తీసుకొస్తున్న స్టాలిన్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు