Yogis Raksha Bandhan Gift
CM Yogis Big Raksha Bandhan Gift : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహిళలకు గురువారం భారీ రక్షా బంధన్ కానుక ప్రకటించారు. కన్యా సుమంగళ యోజన పథకం మొత్తం రూ. 25,000కి పెంచుతూ సీఎం యోగి నిర్ణయం తీసుకున్నారు. 2024-25 నుంచి ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన మొత్తాన్ని రూ. 10,000 పెంచుతున్నట్లు పేర్కొన్నారు. లోక్‌భవన్‌లో ముఖ్యమంత్రి కన్యా సుమంగళ పథకం లబ్ధిదారులను ఉద్ధేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం కన్యా సుమంగళ పథకం మొత్తాన్నిరూ.15,000 నుండి రూ.25,000కి పెంచబోతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి, పౌష్టికాహార శాఖ మంత్రి బేబీ రాణి మౌర్య, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మంత్రి ప్రతిభా శుక్లా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
MP Raghav Chadha : ముంబయి వచ్చిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా…కాబోయే భార్య పరిణీతి చోప్రాను కలిశారు
ఈ పథకం వల్ల రాష్ట్రంలోని ఆడబిడ్డలు తమ కలలను సాకారం చేసుకోవడంతోపాటు చదువుతోపాటు స్వయం సమృద్ధి సాధించడం సులభతరం అవుతుందని సీఎం యోగి అన్నారు. ‘‘వచ్చే ఏడాది నుంచి కూతురు పుట్టిన వెంటనే ఆమె తల్లిదండ్రుల ఖాతాకు రూ. 5వేలు, అదే విధంగా కూతురికి ఏడాది నిండితే మొదటి తరగతిలో చేరగానే రూ.2 వేలు బదిలీ చేస్తాం. రూ. 3,000 ఆరో తరగతిలో చేరినప్పుడు, మరో రూ. 3,000 తొమ్మిదో తరగతిలో చేరితే, రూ. 5,000 కుమార్తె గ్రాడ్యుయేట్ చేసినపుడు, డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సును అభ్యసిస్తే, రూ. 7,000 మొత్తం ఆమె ఖాతాకు బదిలీ చేస్తాం’’ అని సీఎం చెప్పారు.
Mallikarjun Kharge : ఇండియా బ్లాక్ చీఫ్‌గా మల్లికార్జున్ ఖర్గే?
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 16.24 లక్షల మంది ఆడపిల్లలు లబ్ధి పొందుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే దిశలో ముఖ్యమైన రోజు అని సీఎం యోగి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కన్యా సుమంగళ పథకం లబ్ధిదారులు ముఖ్యమంత్రి యోగికి రాఖీ కట్టి సంప్రదాయబద్ధంగా ఆయన నుదుటిపై బొట్టు పెట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిగా ముఖ్యమంత్రి యోగి మహిళలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో 29,523 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.5.82 కోట్లను ముఖ్యమంత్రి బదిలీ చేశారు. పది మంది లబ్ధిదారులకు, వారి తల్లిదండ్రులకు చెక్కులను పంపిణీ చేశారు.