Mallikarjun Kharge : ఇండియా బ్లాక్ చీఫ్‌గా మల్లికార్జున్ ఖర్గే?

Mallikarjun Kharge : ఇండియా బ్లాక్ చీఫ్‌గా మల్లికార్జున్ ఖర్గే?

Mallikarjun Kharge

Mallikarjun Kharge : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇండియా బ్లాక్ కూటమికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ చైర్‌పర్సన్ పదవికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరు ప్రతిపాదించే అవకాశం ఉందని ఇండియా బ్లాక్ వర్గాలు తెలిపాయి. కన్వీనర్‌ పదవికి బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య పోటీ నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. (Mallikarjun Kharges Name Likely To Be Proposed For INDIA bloc Chief) అలాగే నాలుగు కన్వీనర్ల పోస్టులు కూడా ప్రతిపాదించారు.

Tollywood Drugs: టాలీవుడ్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో పలువురు సినీ ప్రముఖులు!

ఇండియా బ్లాక్ కోసం కొత్త థీమ్ సాంగ్ విడుదల ముంబయి సమావేశంలో విడుదల చేయనున్నారు. ఇండియా బ్లాక్ కొత్త థీమ్ సాంగ్ బహుళ భాషల్లో ఉంటుంది. కూటమి లోగోలో భారతదేశ మ్యాప్‌ను ఉంచడంపై ఏకాభిప్రాయం ఉందని పార్టీవర్గాలు తెలిపాయి. ఇండియా బ్లాక్ కూడా కూటమికి సంబంధించిన నినాదాలపై నేతలు చర్చలు జరిపారు. ద్రవ్యోల్బణాన్ని ఓడించటానికి ఇండియా ఉంది, నిరుద్యోగాన్ని తొలగించడానికి ఇండియా ఉంది, ద్వేషపు మంటలను ఆర్పడానికి ఇండియా ఉంది అని నినాదాలను ఎంపిక చేశారు. 11 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ ఏర్పడుతుందని, ఇది ఇండియా బ్లాక్ భవిష్యత్తు పాత్రను నిర్ణయిస్తుందని, ఉమ్మడి కనీస కార్యక్రమం రూపొందించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

Shamshabad : వివాహ వేడుకలో విషాదం.. ఫంక్షన్ హాల్ లో బాలుడు అనుమానాస్పద మృతి

అంతేకాదు మీడియా సెల్‌, సోషల్‌ మీడియా సెల్‌ను కూడా ఏర్పాటు చేయాలని కూటమి యోచిస్తోంది. మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ని ఎదుర్కోవడానికి, 2024 లోక్‌సభ ఎన్నికలలో కేంద్రంలో వరుసగా మూడవసారి గెలవకుండా నిరోధించడానికి ప్రతిపక్ష పార్టీలు కలిసి వచ్చాయి. జూన్ 23వతేదీన పాట్నాలో ఉమ్మడి ప్రతిపక్షం తొలి సమావేశం జరిగింది. జులై 17-18 తేదీల్లో బెంగళూరులో రెండో సమావేశం జరిగింది. మూడో సమావేశం ఆగస్టు 31-సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబయిలో జరగనుంది.