Cobra Mongoose Fight : బురద నీటిలో నాగుపాము ముంగిస పోరు .. చూసి తీరాల్సిందే..

బురద నీటిలో నాగుపాము ముంగిస పోరు .. చూసి తీరాల్సిందే..

King Cobra Mongoose Fight : ఆరు అడుగుల పొడుగు ఉండే నాగు పాము కూడా అడుగు పొడుగు కూడా లేని ముంగిసకు భయపడుతుంది. ఎందుకంటే నాగుపాము ముంగిస పోట్లాడుకుంటే ముంగిసే గెలుస్తుంది. ఎంతపెద్ద పామునైనా కట్టికరిపిస్తుంది ముంగిస. పాములు, ముంగీసలు కొట్లేడే వీడియోలు చూసే ఉంటాం. ఇలాంటిదే ఓ వీడియో వైల్డ్‌ యానిమలియా ఖాతాలో పోస్ట్‌ చేయగా.. వైరల్‌గా మారింది.

ఓ మురదనీటి మడుగులో కోబ్రాను చూసిన ముంగీస దానిపై దాడికి ప్రయత్నించింది. పాము కూడా ఏమాత్రంతగ్గలేదు. బుసలు కొడుతూ కాటువేస్తూనే తప్పించుకునేందుకు యత్నించింది. ఇలా కొద్దిసేపు నాగుపాము – ముంగీస పోట్లాడాయి. కోబ్రా తనను తాను ముంగీస నుంచి కాపాడుకునేందుకు పాపం పలు విధాలుగా యత్నించింది. అదికాస్త పక్కకు వెళ్లితే పారిపోదామనుకంది. కానీ ముంగిస మాత్రం పాముని వదల్లేదు. మరోవైపు నుంచి తిరిగి వచ్చి మరీ పాముతో పేచీని కొనసాగించింది. పాము ఎంత ప్రయత్నించినా ముంగీస వెంటాడింది. వీటి పొట్లాటపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.
Boy Play football with Dog : పిల్లాడితో ఫుట్​ బాల్​ ఆడుతున్న కుక్కపిల్ల.. నెటిజన్లు ఫిదా

ఈ వీడియోను 2లక్షల వ్యూస్ రాగా..వేలకొద్దీ లైక్స్‌ వచ్చాయి. కింగ్‌ కోబ్రా – ముంగీస మధ్య జరిగో పోరులో సాధారణంగా 75 నుంచి 80శాతం వరకు ముంగీసదై పైచేయి. ముంగీసలు నాగుపాములు తదితర విషపూరితమైన వాటిని కొరికి తింటాయి. మరి ఈ వీడియోను పూర్తిగా చూసి గెలుపు ఎవరిదో చూడండీ..

 

 

ట్రెండింగ్ వార్తలు