Boy Play football with Dog : పిల్లాడితో ఫుట్​ బాల్​ ఆడుతున్న కుక్కపిల్ల.. నెటిజన్లు ఫిదా

పిల్లాడితో ఫుట్​ బాల్​ ఆడుతున్న కుక్కపిల్ల తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Boy Play football with Dog : పిల్లాడితో ఫుట్​ బాల్​ ఆడుతున్న కుక్కపిల్ల.. నెటిజన్లు ఫిదా

Boy Play football with Dog

Updated On : October 15, 2022 / 4:01 PM IST

Boy Play football with Dog : ఓ వీధిలో ఓకుక్కపిల్ల ఫుడ్ బాల్ ఆడింది. ఓ పిల్లాడితో కలిసి కుక్కపిల్ల ఫుడ్ బాల్ ఆడిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఏమాత్రం తగ్గేదేలేదంటూ ఆ కుక్కపిల్ల ఏమాత్రం బాల్ ఒక్కసారికూడా మిస్ అవ్వకుండా బాల్ ఆడింది. ఓ బాలుడు బాల్ ను కుక్కవైపు తన్నగా అదికూడా బంతిని ఏ మాత్రం మిస్ కాకుండా పట్టుకుని తన్నిన కుక్కపిల్ల తన్నుతూ ఆడింది. వీరి ఆట తీరు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Cobra Mongoose Fight : బురద నీటిలో నాగుపాము ముంగిస పోరు .. చూసి తీరాల్సిందే..

పిల్లలతో పాటు పెద్దలు కూడా తమ పెంపుడు జంతువులతో ఆటలాడటం సాధారణమే. ముఖ్యంగా కుక్కపిల్లలు మనుషులతో కలిసి ఆడటానికి ఉత్సాహపడుతుంటాయి. మనం ఏదైనా వస్తువునుగానీ, బాల్ ను గానీ విసిరివేస్తే.. కుక్కలు పరుగెత్తుకు వెళ్లి తెచ్చిస్తుంటాయి. కొన్నిసార్లు నోటితో క్యాచ్ పడుతుంటాయి కూడా. ఓ చిన్నారితో కుక్కపిల్ల ఫుట్ బాల్ ఆడిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియోలో ఓ వీధిలో చిన్నారి ఓ వైపు, కుక్కపిల్ల మరోవైపు ఉండి ఫుట్ బాల్ ఆడుతున్నారు. చిన్నారి కాలితో బాల్ ను తంతే కుక్కపిల్ల దాన్ని తిరిగి చిన్నారి వైపు తోస్తోంది. బంతిని తలతో, కాళ్లతో ఆపుతూ.. ఒక్కోసారి కాళ్లతో, ఒక్కోసారి తలతో బంతిని తోస్తుండటం ఆకట్టుకుంది. ఎక్కడా తగ్గకుండా, ఏమాత్రం మిస్సవకుండా బాల్ ను ఆపుతుండటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

బిటింగెబీడెన్ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. నాలుగు రోజుల్లోనే 13 లక్షలకుపైగా వ్యూస్ వస్తున్నాయి.6వేలకుపైగా ట్వీట్లు, 53 వేలకుపైగా లైకులు కూడా వచ్చాయి.