Cockroach Janta Party protest : కాక్రోచ్ జనతా పార్టీకి భారీ ఊరట.. ధర్నాకు అనుమతి.. ఢిల్లీలో అడుగుపెట్టిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే..
Cockroach Janta Party protest : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Cockroach Janta Party' founder Abhijeet Dipke landed in Delhi
Cockroach Janta Party protest : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, ధర్నాను శాంతియుతంగా నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీయకుండా శాంతియుత వాతావరణంలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు తమ నిరసన తెలుపుకోవచ్చునని పోలీసులు అనుమతి ఇచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమానికి ఢిల్లీ పోలీసుల నుంచి అనుమతి లభించిందని సీజేపీ వెల్లడించింది.
Also Read : Sahara Desert Tragedy : ఘోర విషాదం.. ఎడారిలో చెడిపోయిన ట్రక్కు.. నీరు దొరక్క 49 మంది మృతి..
నీట్, సీబీఎస్ఈ, సీయూఈటీ, ఎస్ఎస్సీ వంటి పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ నిరసన తెలిపేందుకు శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించేందుకు ఆ పార్టీ సృష్టికర్త అభిజిత్ దీప్కే నిర్ణయించారు. అయితే, అమెరికాలో ఉంటున్న ఆయన శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులో అభిజిత్ దీప్కేకు సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. అయితే, విమానాశ్రయంలో అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి కచ్చితంగా రాజీనామా చేయాలి. అయిదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముఖచిత్రం ఉన్న పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఎయిర్ పోర్టులో నుంచి బయటకు వచ్చారు.
