Vivo S2 Sale : వివో లవర్స్ మీకోసమే.. వివో S2 ఫస్ట్ సేల్.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్!
Vivo S2 Sale : వివో S2 ఫోన్ 1260×2800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్కు సపోర్టు ఇస్తుంది.

Vivo S2 Sale : వివో లవర్స్ పండగ చేస్కోండి.. భారత మార్కెట్లో వివో S2 ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7050mAh బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. 6.83-అంగుళాల 120Hz అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్లోని 32MP సెల్ఫీ కెమెరా స్పెషల్ అట్రాక్షన్. IP68 + IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ అందిస్తుంది. ఈ ఫోన్ రూ. 40వేల లోపు ధరలో లభిస్తుంది. వివో S2 స్పెసిఫికేషన్లు, ధర లాంచ్ ఆఫర్లపై ఓసారి లుక్కేయండి.

వివో S2 ఫోన్ సఫైర్ బ్లూ, రీగల్ బ్రాంజ్, సిల్క్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ వివో సేల్స్ ఈరోజు, ఆగస్టు 11న ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ 2 వేరియంట్లలో లాంచ్ అయింది. 8GB+128GB కాన్ఫిగరేషన్ ధర రూ. 39,999 కాగా, 8GB+256GB వేరియంట్ ధర రూ. 44,999కు లభిస్తుంది.

కంపెనీ అధికారిక పోర్టల్ ద్వారా కొంటే ఏడాది ఎక్స్టెండెడ్ వారంటీతో సహా కొన్ని ఆఫర్లు ఉన్నాయి. అదనంగా, రూ. 4,500 ఎక్స్ఛేంజ్ బోనస్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈఎంఐ లావాదేవీలపై రూ. 4,500 తగ్గింపు, ఫుల్ స్వైప్ పేమెంట్లపై రూ. 2,250 తగ్గింపు పొందవచ్చు.

వివో S2 ఫోన్ 1260×2800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్కు సపోర్టు ఇస్తుంది. ఇందులో ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్ 7050mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 44W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7360-టర్బో చిప్‌సెట్‌ను అమర్చారు. 8జీబీ LPDDR4X ర్యామ్, 256GB వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందిస్తుంది. అదనపు వర్చువల్ ర్యామ్ కూడా పెంచుకోవచ్చు. కంపెనీ 8GB వరకు ఎక్స్టెండెడ్ ర్యామ్ సపోర్టు అందిస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వివో S2లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇందులో 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. వివో S2లో డ్యూయల్ 5G, Wi-Fi 5, బ్లూటూత్ 5.4, USB టైప్-C, OTG, GPS, GLONASS ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 7.99 మిమీ మందంతో ఉంటుంది. వేరియంట్‌ను బట్టి 197-199 గ్రాముల బరువు ఉంటుంది.
