Weather Report : ఉత్తరభారతావనిలో చలిగాలులు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు

ఉత్తరభారతం చలితో వణికిపోతోంది. మరో ఐదు రోజుల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Weather Report

Weather Report : ఉత్తరభారతం చలితో వణికిపోతోంది. మరో ఐదు రోజుల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ గాలుల వలన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీల వరకు తగ్గుతాయని తెలిపింది. డిసెంబర్ 17 నుంచి 21 వరకు పంజాబ్, హర్యానా, చండీఘడ్, సౌరాష్ట్ర, కచ్ లలో చలిగాలులు వీచే అవకాశం ఉందని, డిసెంబర్ 18 నుంచి 21 వరకు ఉత్తర రాజస్థాన్ లో డిసెంబర్ 19నుంచి 21 వరకు పశ్చిమ ఉత్తరప్రదేశ్ చలిగాలులు వీస్తాయని తెలిపారు. ఉష్ణోగ్రతల పతనం తూర్పు భారతదేశం.. మహారాష్ట్రపై అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే 5 రోజుల్లో మహారాష్ట్రలో ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గుతాయని తెలిపారు.

చదవండి : Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..తమిళనాడుపై విరుచుకుపడనుందా?

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో గురువారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 8.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తేలికపాటి మేఘాలు ఆవరించి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది. దీని కారణంగా వచ్చే రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు కొన్ని డిగ్రీలు తగ్గుతుంది. ఇక ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చలి తీవ్రత పెరిగింది. పర్యాటక ప్రాంతం గుల్‌మార్గ్‌లో ఇప్పటివకు ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గాయి. హైదరాబాద్ నగరంలో గత మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. నగరంలో ఈ రోజు ఉదయం 12 డిగ్రీ సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత నమోదైంది. గురువారంతో పోల్చితే శుక్రవారం చలి తీవ్రత పెరిగింది. మరికొన్ని రోజులు ఉష్ణోగ్రతలు ఇలానే ఉంటాయని అధికారులు తెలిపారు.

చదవండి : Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..తమిళనాడుపై విరుచుకుపడనుందా?