Bus-Truck Collision : ట్రక్కును ఢీ కొట్టిన బస్సు..ఐదుగురి పరిస్థితి విషమం

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదర్​ టీటీ ప్రాంతంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 7.30 గంటల సమయంలో

Mumbai

Bus-Truck Collision మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదర్​ టీటీ ప్రాంతంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 7.30 గంటల సమయంలో ఓ బస్సు వేగంగా వచ్చి డంపర్  ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో.. బస్సులో ప్రయాణిస్తున్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను స్థానికులు వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు.

తీవ్రంగా గాయపడిన వారిలో.. రాజేంద్ర (53), కాశీరామ్‌ ధూరీ (57), తాహిర్‌ హుస్సెన్‌ (52), రూపాలి గైక్వాడ్‌ (36), సుల్తాన్‌ (50), శ్రావణి మోస్కీ (16), వైధేహి బామనీ (17), మాన్సూర్‌ ఆలీ (52) ఉన్నారు.

అయితే బస్సు డ్రైవర్​, కండక్టర్​ సహా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సుపై డ్రైవర్​ నియంత్రణ కోల్పోవటం వల్లే ప్రమాదం జరిగినట్లు గ్రేటర్​ ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులు తెలిపారు. ఈ ప్రమాద దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ALSO READ T20 World Cup 2021: షోయబ్ అక్తర్ కు తీరని అవమానం… లైవ్ షో నుంచి పంపేసిన టీవీ హోస్ట్