రంగుల కేళీ హోలీ : సహజ రంగుల తయారీ ఇలా.. 

  • Publish Date - March 21, 2019 / 03:38 AM IST

హైదరాబాద్ : రంగులతో ఆడే కేళీ హోలీ పండుగ. మనజీవితంలో రంగులు నింపే పండగ హోలీ. చిన్నా పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటు ఆనందంగా చేసుకునే ఈ హోలీ పండుగ హోలీ. ప్రకృతి..మనిషి చాలా అవినావభావం సంబంధం ఉంది. ప్రతీ పండుగ మనిషికి ఆరోగ్యాన్ని..ఉల్లాసాన్ని ఇచ్చే పండుగలే కావటం  భారతదేశంలోని ప్రత్యేకత.  ప్రకృతిలో  రుతువులు మారే సమయంలో..చలికాలానికి వీడ్కోలు పలుకుతూ వేసవిని స్వాగతిస్తూ ఒంటికి చల్లదనాన్ని కలిగించే రంగుల్ని చల్లుకుంటూ ఆటపాటలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే వేడుకే హోలీ పండుగ. 
 

మనం హోలీ రోజు ఒంటికి పులుముకునే రంగులు నిజంగా మన ఆరోగ్యానికి మంచి చేస్తున్నాయా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే హోలీలో ఆడే రంగులన్నీ రసాయినాలతో తయారు చేసినవే. వీటివల్ల మనకు మంచి జరగదు సరికదా లేని పోని అనారోగ్యాల్ని..సమస్యల్ని  తెచ్చిపెడతాయి. అలాంటప్పుడు చర్మానికి హాని చేస్తాయని భావించే రసాయనాలతో కూడిన రంగులు వాడటమెందుకు చెప్పండి? మనమే సొంతంగా ఇంట్లో సహజసిద్ధమైన రంగులు తయారుచేసుకోవచ్చు. ఏంటీ ఇంత బిజీ బిజీ లైఫ్ లో మనమే స్వయంగా రంగులు తయారుచేసుకోవడం ఈజీ కాదు అని నిర్లక్ష్యం వద్దు..హోలీ పండుగ పరమార్థాన్ని మనం పొందాలంటే కొంచెం టైమ్ కేటాయిస్తే తప్పకుండా సాధ్యమవుతుంది. మరి సహజ రంగుల్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. 

సహజ రంగుల తయారీ ఇలా 
ఎర్రమందారం, టమోటో, క్యారెట్‌లతో ఎంచక్కా ఎరుపు రంగును తయారు చేసుకోవచ్చు. ఇవి ఒంటిమీద పడినా..పొరపాటున కంటిలో పడినా..నోటిలోకి వెళ్లినా ఎటువంటి ప్రమాదం జరగదు. గోరింట ఆకులతో ఆకు పచ్చని రంగును తయారుచేసుకోవచ్చు..బీట్ రూట్‌తో గులాబి రంగు..పసుపు కొమ్ములను దంచి నీళ్లలో నానబెట్టి పసుపు వర్ణాన్ని..తయారు ఎంచక్కా వాడుకోవచ్చు. ఇకపోతే  మోదుగ పూలను నీటిలో నానబెట్టి చేసే వచ్చే  రంగుకు గ్రామాల్లో ఎంతో ఇంపార్టెంట్ ఉంది. దాని వల్ల ఎంతో ఆరోగ్యాన్ని కూడా పొందొచ్చు. అలాగే గోగు పూలు(గోంగూరు లేదా పుంటికూర అంటారు)తో ఎరుపు రంగును తయారుచేసుకోవచ్చు. ఇలా రకరకాల చెట్ల ఆకులు, పూలతో ఎన్నో రంగులను తయారుచేసి హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవచ్చు. 

మనమే స్వయంగా తయారు చేసుకున్న వాటితో హోలీ ఆడుకుంటే ఆ ఆనందం..తృప్తి వేరుగా ఉంటాయ్ కదా..అటువంటి రంగులను మనకు ప్రకృతే ఇస్తుండగా ప్రమాదాన్ని కలిగించే ఇటువంటి రసాయినాలు మనకెందుకు చెప్పండి. ఏ పండుగ జరుపుకున్నా..అది మనకు సంతోషాన్ని..ఆరోగ్యాన్ని ఇవ్వాలి గానీ..ప్రమాదాలను..అనారోగ్యాలను తెచ్చి పెట్టకూడదు….అందుకే రసాయిన రంగులను వద్దు..సహజంగా ప్రకృతి మనిషికి ఇచ్చిన రంగులే ముద్దు..