Munawar Faruqui's Delhi Show
Munawar Faruqui’s Delhi Show: ఢిల్లీలోని కేదార్‌నాథ్ స్టేడియంలో రేపు జరగాల్సిన మునావర్ ఫారూఖి స్టాండప్ కామెడీ షోకు అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆ షో రద్దు అయింది. మునావర్ షోను రద్దు చేయాలని ఇటీవల ఢిల్లీ పోలీసులకు విశ్వ హిందూ పరిషత్ లేఖ రాసిన విషయం తెలిసిందే. మునావర్ గతంలో కామెడీ షోలో హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడు ఎక్కడ షో చేయాలనుకున్నా హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఇటీవల హైదరాబాద్ లోనూ అతడు షో నిర్వహించిన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. చివరకు పోలీసు బందోబస్తు మధ్య షో చేసి వెళ్ళాడు. అతడు రేపు ఢిల్లీలో స్టాండప్ కామెడీ షోకు వెళ్ళాల్సి ఉంది. దీంతో వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నిరసనలు తెలిపాయి. మునావర్ ఫారూఖి స్టాండప్ కామెడీ షోకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ఇవాళ ప్రకటన చేశారు.
అతడి షో వల్ల మత సామరస్యానికి భంగం కలిగే ప్రమాదం ఉందని అన్నారు. కొన్ని రోజుల క్రితం బెంగళూరులో జరగాల్సి ఉన్న అతడి షోను కూడా అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్ లో మాత్రం అతడి కామెడీ షో జరిగింది.
Asia Cup 2022: ఇప్పటివరకు ఏ భారత క్రికెటరూ నెలకొల్పని రికార్డు రేపటితో కొహ్లీ సొంతం