Gas Cylinder Rate: న్యూ ఇయర్ గిఫ్ట్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

కొత్త సంవత్సరం కానుకగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.102 ధర తగ్గించాయి చమురు కంపెనీలు. 19కిలోల గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించగా.. గృహ అవసరానికి వినియోగించే 14.2కేజీ గ్యాస్ సిలిండర్

Indane Gas Sylinder

Gas Cylinder Rate: కొత్త సంవత్సరం కానుకగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.102 ధర తగ్గించాయి చమురు కంపెనీలు. 19కిలోల గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించగా.. గృహ అవసరానికి వినియోగించే 14.2కేజీ గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ధరల్లో చేసిన మార్పులు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

ధర తగ్గింపుతో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ఢిల్లీలో రూ.1998.50లకు, కోల్‌కతాలో రూ.2,074.50లకు, ముంబైలో రూ.వెయ్యి 951లకు, చెన్నైలో రూ.2,134.50లకు దొరకనుంది.

గమనించాల్సిన విషయమేమిటంటే చివరినెల డిసెంబర్ 1న కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరపై రూ.100పెంచగా.. జనవరిలో తగ్గించింది రూ.102మాత్రమే. అంటే మొత్తం మీద తగ్గించిందెంతో వినియోగదారుడికి తెలిసిందే.

ఇది కూడా చదవండి : ఆరుగురు మావోయిస్ట్ మిలీషియా సభ్యులు అరెస్ట్

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, రూపాయి డాలర్‌ మారక విలువ అంశాలు భారత్‌లో గ్యాస్ ధరలపై ప్రభావం చూపిస్తాయి.