Complete Lockdown In Karnataka From May 10 To May 24
Complete lockdown కర్ణాటకలో కఠిన ఆంక్షలు విధించినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని యడియూరప్ప సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10న (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 24 ఉదయం 6 గంటల వరకూ పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప శుక్రవారం ప్రకటించారు. కరోనా కర్ఫ్యూ విఫలం కావడం వల్లే లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు.
లాక్‌డౌన్ సందర్భంగా కర్ణాటక వ్యాప్తంగా అన్ని హోటళ్లు, పబ్బులు, బార్లు మూసి ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. ఇక హోటళ్లు, మాంసం దుకాణాలు, కూరగాయల దుకాణాలు మాత్రం ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ తెరిచి ఉంటాయని చెప్పారు. మెడికల్ సంబంధమైన వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్టు యడియూరప్ప తెలిపారు. ఉదయం 10గంటల తర్వాత రోడ్డుపై ఒక్కరికి కూడా అనుమతి లేదని సీఎం తేల్చి చెప్పారు. కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నందు వల్లే లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని…ఇది తాత్కాలిక నిర్ణయమేనని, వలస కూలీలు రాష్ట్రాన్ని వీడొద్దని సూచించారు.