Coal Scam In Gujarat :గుజరాత్‌లో 6,000 కోట్ల బొగ్గు కుంభకోణం..సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు కాంగ్రెస్ డిమాండ్

గుజరాత్‌లో 6,000 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందనీ..ఈ స్కామ్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

Coal Scam In Gujarat

Rs.6000 crore Coal Scam In Gujarat : గుజరాత్‌లో రూ.6,000 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగినట్టుగా బయటపడిందని బుధవారం (ఫిబ్రవరి 23,2022)కాంగ్రెస్‌ ఆరోపించింది. దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇది అప్పటి సీఎంలుగా ఉన్న ముగ్గురు వ్యక్తుల హాయంలోనే జరిగిందని దీనిపై విచారణ జరిపించాలని రాహల్ గాంధీ డిమాండ్ చేశారు. గుజరాత్ రాష్ట్ర చిన్న, మధ్యతరరహా పరిశ్రమలకు ఉద్దేశించిన బొగ్గును ఇతర రాష్ర్టాల్లోని పెద్ద కంపెనీలకు అమ్మేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిర్ణీత గడువుతో ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని గుజరాత్ ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ డిమాండ్‌ చేసింది.

Also read : UK Parliament : బ్రిటన్ పార్లమెంట్ లో ప్రసంగించిన హైదరాబాద్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థి పిల్లారిశెట్టి సాయిరాం

ఈ కుంభకోణం జరిగినప్పుడు అంటే 14 సంవత్సరాల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు (ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ, విజయ్‌ రూపాణీ, భూపేంద్ర పటేల్‌) పరిశ్రమలు, గనులు, ఖనిజాల శాఖ ఎవ్వరికి కేటాయించకుండా తమవద్దే ఉంచుకున్నారని..అది యాదృచ్చికంగా జరిగిందికాదని కావాలనే ఆ శాఖను తమవద్దే ఉంచుకున్నారని..ఇది అనుమానాలకు తావిస్తున్నదని కాంగ్రెస్‌ ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ మీడియాకు వెల్లడించారు. కోల్‌ ఇండియా గనుల నుంచి వెలికి తీసిన బొగ్గు ఉద్దేశించిన పరిశ్రమలకు చేరలేదని అన్నారు.

2001 నుంచి 2014 వరకు 14 సంవత్సరాల్లో 60 లక్షల టన్నుల బొగ్గును కోల్‌ ఇండియా గుజరాత్‌లోని వ్యాపారులు, చిన్నపరిశ్రమ దారుల పేరుతో తరలించిందని … చెప్పారు. ఆ బొగ్గు సగటు ధర టన్నుకు రూ.1,800 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది. కానీ దానిని ఇతర రాష్ర్టాల్లో రూ.8,000 నుంచి రూ.10,000 వరకు అధికధరకు అమ్మారని ఈ సందర్భంగా గైరవ్ వల్లభ్‌ ఆరోపించారు.గుజరాత్‌ ప్రభుత్వం లబ్ధిదారుల గురించి పంపిన వివరాలు నకిలీవని తేలిందని..కానీ అనుకున్న గమ్యానికి బొగ్గు చేరనే లేదని అన్నారు. బొగ్గు నుంచి లబ్ధి పొందేందుకు బహుశా నకిలీ బిల్లులు సృష్టించి ఉంటారని అన్నారు.

Also read : Amaravati Farmers: 800రోజులకు చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం

కాగా..గుజరాత్ లో “60 లక్షల టన్నుల బొగ్గు ‘తప్పిపోయింది’! ఈ బొగ్గు కుంభకోణంపై ప్రధాన ‘స్నేహితుడు’ సదరు మంత్రి ఏమైనా చెబుతారా” అంటూ రాహుల్ గాంధీ ట్వీట్‌లో ప్రశ్నించారు. కోల్‌ ఇండియా గనుల నుంచి వెలికి తీసిన బొగ్గు ఉద్దేశించిన పరిశ్రమలకు చేరలేదని అన్నారు.