Kanhaiya Kumar
Kanhaiya Kumar – Congress: యువ నేత, ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ను నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ఏఐసీసీ ఇన్‌ఛార్జిగా నియమిస్తూ కాంగ్రెస్ (Congress) పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో తమ పార్టీ స్టూడెంట్ వింగ్ విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్ఎస్‌యూఐను 1971, ఏప్రిల్ 9న స్థాపించారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్, పశ్చిమ బెంగాల్ ఛత్ర పరిషత్ ను విలీనం చేసి ఎన్ఎస్‌యూఐను మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎన్ఎస్‌యూఐకు నీరజ్ కుందన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
కన్నయ్య కుమార్ ఎవరు?
ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కన్నయ్య కుమార్ దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించారు. 1987లో జన్మించిన కన్నయ్య కుమార్ పాట్నా కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చదువుతున్న సమయంలో స్టూడెంట్స్ పాలిటిక్స్ లో ఉన్నారు. 2015లో ఢిల్లీలోని జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా, ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకుడిగా పనిచేశారు. సీపీఐకు 2021లో కన్నయ్య కుమార్ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.
Telangana Politics: బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేసిన కిషన్ రెడ్డి