Presidential Election : ఆ భయంతోనే.. చెన్నైకు గోవా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తరలింపు..!

గోవా కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పార్టీ ఎమ్మెల్యేలపై ఓ కన్నేసింది. బీజేపీ వేసే ఎత్తుగడలకు ఎక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోతారేమోనని ముందుగానే గోవా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది.

Presidential Election : గోవా కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పార్టీ ఎమ్మెల్యేలపై ఓ కన్నేసింది. బీజేపీ వేసే ఎత్తుగడలకు ఎక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోతారేమోనని ముందుగానే గోవా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది. అందులో భాగంగానే గోవా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను వెంటనే చెన్నైకి తరలించింది. గోవా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాత్రికి రాత్రే ఆ ఐదుగురు పార్టీ ఎమ్మెల్యేలను చెన్నైకి పంపేసింది. ఆ ఎమ్మెల్యంతా అక్కడి హోటల్‌లో బస చేస్తున్నట్టు సమాచారం. గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కార్లోస్ అల్వారెస్, యూరి అలెమో, సంకల్ప్ అమోంకర్, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్, ఆల్టన్ డికోస్టా సహా అందరూ చెన్నైలో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

బీజేపీ గాలం నుంచి వీరిని కాపాడేందుకు గోవా కాంగ్రెస్ ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. ఎందుకంటే.. గోవాలో అధికారంలో బీజేపీ ఉండటమే ఇందుకు కారణం.. రాష్ట్రంలో ప్రతిపక్షమైన బలంగా ఉన్న కాంగ్రెస్‌లో బీజేపీ చిచ్చుపెట్టింది. అప్పటినుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలామంది అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి రెబల్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు బీజీపీ వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో చాలామంది ఇప్పటికే బీజీపీ చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి మొత్తం 11 మంది ఎమ్మెల్యేల్లో 6 మాత్రం హాజరుకాలేదు. వారంతా 2 రోజులు పార్టీ నాయకత్వానికి కూడా అందుబాటులో లేరు.

Congress Flies Out 5 Goa Mlas To Chennai Over Poaching Fears

ఆ 6 కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నారంటూ ఊహాగానాలు వచ్చాయి. సోమవారం ప్రారంభమైన గోవా అసెంబ్లీ సమావేశాలకు ఆ 6 కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వేరుగా వచ్చారు. దీనికి అంతంటికి కారణం గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మైఖేల్ లోబోనే అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. వెంటనే కాంగ్రెస్ అధిష్టానం.. మైఖేల్‌ను పదవి నుంచి తప్పించింది. అంతేకాదు.. దిగంబర్ కామత్‌పై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు నోటీసులు కూడా పంపింది. ఇదిలా ఉండగా.. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. మిగిలిన 5 ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడకుండా ఉండేలా కాంగ్రెస్‌ జాగ్రత్త పడుతోంది. బీజేపీ వలలో పడకుండా ఉండేందుకు 5 ఎమ్మెల్యేలను చెన్నైకి తరలించింది. వచ్చే సోమవారం ఉదయం (జూలై 18) నేరుగా చెన్నై నుంచి అసెంబ్లీకి వారిని తరలించనుంది.

Read Also : Rahul Gandhi: ‘కుంభ‌క‌ర్ణ’ నిద్ర‌నుంచి మేల్కోండి: రాహుల్ గాంధీ

ట్రెండింగ్ వార్తలు