Rahul Gandhi: ‘కుంభ‌క‌ర్ణ’ నిద్ర‌నుంచి మేల్కోండి: రాహుల్ గాంధీ

''ఇప్ప‌టికీ స‌మ‌యం ఉంది.. ఈ ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా కుంభ‌క‌ర్ణ నిద్ర నుంచి మేల్కోవాల‌ని నేను మ‌ళ్ళీ చెబుతున్నాను. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌ప‌ట్టే రాజకీయాల‌ను ఇకనైనా మానుకోవాలి. ఆర్థిక విధానాల‌ను వెంట‌నే సంస్క‌రించాలి. ఈ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల వ‌ల్ల ప‌డే శిక్ష‌ను (ప‌రిణామాల‌ను) దేశంలోని సామాన్య ప్ర‌జ‌లు భ‌రించ‌లేరు'' అని రాహుల్ గాంధీ చెప్పారు.

Rahul Gandhi: ‘కుంభ‌క‌ర్ణ’ నిద్ర‌నుంచి మేల్కోండి: రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi: డాల‌ర్‌తో పోల్చితే రూపాయి మార‌కం విలువ ఎన్న‌డూ లేనంత ప‌డిపోవ‌డంపై కాంగ్రెస్ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల వ‌ల్ల మ‌న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ భారీ మూల్యం చెల్లించుకుంటోంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చిదంబ‌రం విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ ఫేస్‌బుక్‌లో హిందీలో ఓ పోస్ట్ చేశారు.

”అమెరికా డాల‌ర్‌తో పోల్చితే చ‌రిత్ర‌లో తొలిసారి రూపాయి మార‌కం విలువ రూ.80కి చేరింది. ఏ గ‌మ్య‌మూ లేని ఈ కేంద్ర ప్ర‌భుత్వం వ‌ల్ల దేశ ప్ర‌జ‌లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది.. రూపాయి పత‌నం కొన‌సాగుతూనే ఉంటుంది. రూపాయి మార‌కం విలువ బ‌ల‌ప‌డాలంటే దేశానికి బ‌ల‌మైన ప్ర‌ధాని కావాల‌ని మ‌న ప్ర‌స్తుత ప్ర‌ధాని అన్నారు. ఆయ‌న చెప్పిన ఈ మాట‌లో ఎంత‌ వాస్త‌వం ఉందో ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ తెలుస్తోంది.

ఇప్ప‌టికీ స‌మ‌యం ఉంది.. ఈ ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా కుంభ‌క‌ర్ణ నిద్ర నుంచి మేల్కోవాల‌ని నేను మ‌ళ్ళీ చెబుతున్నాను. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌ప‌ట్టే రాజకీయాల‌ను ఇకనైనా మానుకోవాలి. ఆర్థిక విధానాల‌ను వెంట‌నే సంస్క‌రించాలి. ఈ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల వ‌ల్ల ప‌డే శిక్ష‌ను (ప‌రిణామాల‌ను) దేశంలోని సామాన్య ప్ర‌జ‌లు భ‌రించ‌లేరు” అని రాహుల్ గాంధీ చెప్పారు.

Maharashtra: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు.. ‘మ‌హా’ కేబినెట్ కీల‌క‌ నిర్ణయాలు