రిపబ్లిక్ డే వేడుకలు..కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

  • Publish Date - January 26, 2020 / 11:23 AM IST

దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. తమ దేశ భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రిపబ్లిక్ డే..జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బాహాబాహికి దిగడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన ఇండోర్‌లో చోటు చేసుకుంది. 

2020, జనవరి 26వ తేదీన ఇండోర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు చేశారు. జాతీయ పతాకం ఆవిష్కరణకు కాంగ్రెస్ నేతలు రెడీ అయిపోయారు. అయితే..దేవేంద్ర సింగ్ యాదవ్, చందు కుంజీర్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా అందరూ చూస్తుండగానే ఒకరినొకరు కొట్టుకున్నారు. అక్కడనే ఉన్న పార్టీ నేతలు వారించే ప్రయత్నం చేశారు. పోలీసులు వీరిని శాంతింపచేసే యత్నం చేశారు.

Read More : గ్రాండ్ వెల్ కమ్ : ఇంటికి వచ్చిన KTRకు మంగళహారతితో స్వాగతం

ఇరువురు నేతలను అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీంతో గొడవ సద్దుమణిగింది. కానీ అసలు వీరిద్దరి మధ్య వాగ్వాదం ఎందుకు జరిగింది ? ఎందుకు కొట్టుకున్నారనేది తెలియలేదు. మరోవైపు చందు కుంజీర్‌పై దేవేంద్ర సింగ్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2018 డిసెంబర్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.