Rahul Gandhi
Rahul Gandhi: ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాలతో కలిసి మొత్తంగా 122 రోజుల పార్లమెంట్ సమావేశాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోల్పోయారని సుప్రీంకోర్టు ముందు ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. మోదీ ఇంటి పేరు కేసులో జైలు శిక్ష అనంతరం రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. అయితే గుజరాత్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును పార్లమెంటులో సవాలు చేశారు. ఈ పిటిషన్ మీద జస్టిస్ గవాయి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తొలిసారి శుక్రవారం వాదనలు విన్నది. కాగా, రాహుల్ గాంధీ మీద కేసు వేసిన పుర్నేష్ మోదీ సహా ఈ కేసుకు సంబంధం ఉన్న ఇతరులను పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం ఆగస్టు 4 నుంచి దీనిపై విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది.
America : అమెరికాలో భారతీయ విద్యార్థినిపై పిడుగుపాటు .. మెదడు,గుండెపై ప్రభావం..మృత్యువుతో పోరాటం
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందారు. కాగా, రాహుల్ ఎంపీ సభ్యత్వం రద్దు కావడంపై సీనియర్ న్యాయవాది సింఘ్వీ వాడీవేడీగా వాదనలు వినిపంచారు. వయనాడ్ స్థానానికి ఎన్నికల సంఘం ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ప్రకటించవచ్చని, దాని వల్ల ప్రస్తుతం తాము వేసిన పిటిషన్ మీద వీలైనంత తొందరగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ గవాయ్ కాంగ్రెస్‌తో తనకు నాలుగు దశాబ్దాల బంధం ఉందని, తదుపరి విచారణకు ఆటంకం కలిగించకూడదని కూడా ప్రస్తావించడం గమనార్హం.
Telangana Rains: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లు జారీ చేసిన వాతావరణ శాఖ
మార్చి 24న గుజరాత్లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో కాంగ్రెస్ నేత ఎంపీగా అనర్హత వేటు వేసింది. ఈ తీర్పును గుజరాత్ హైకోర్టులో సవాలు చేయగా.. అక్కడా ఎదురుదెబ్బే తగిలింది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ జూలై 7న గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని రాహుల్ గాంధీ ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఆయన తరపు న్యాయవాది కోరతుతున్నారు. స్టే విధించడం వల్ల రాహుల్ గాంధీని లోక్‌సభ ఎంపీగా తిరిగి నియమించబడటానికి మార్గం సుగమం అవుతుంది. అయితే కోర్టు తీర్పు నుంచి ఎలాంటి ఉపశమనం లభించదు.