Congress leader Rahul Gandhi
Rahul Gandhi With Wrestlers In Haryana : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఉదయం హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని అఖాడాను సందర్శించారు. బజరంగ్ పునియాతో పాటు పలువురు రెజ్లర్ల బృందాన్ని కలిశారు. రాహుల్ ఆకస్మికంగా అఖారాకు వెళ్లడంతో రెజ్లర్లు ఆశ్చర్య పోయారు. ఈ విషయంపై రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర ఆచార్య మాట్లాడుతూ.. మేం ప్రాక్టీస్ చేస్తున్నాం.. అకస్మాత్తుగా రాహుల్ రావడంతో అందరం ఆశ్చర్య పోయాం. రాహుల్ ఉదయం 6.15 గంటలసమయంలో తమ వద్దకు వచ్చారు. ఆయన వస్తున్నట్లు మాకు ముందుగా సమాచారం లేదు. రాహుల్ అఖారాలో మాతో వ్యాయమాం చేశారు. ఆపై తన వ్యాయామం, క్రీడల గురించి చెప్పారు. రాహుల్ కు క్రీడల గురించి చాలా అవగాహన ఉందని వీరేంద్ర ఆచార్య అన్నారు.
Also Read : Vamsi Krishna Srinivas : వైసీపీకి వంశీ రాజీనామా? జనసేన వైపు ఎమ్మెల్సీ చూపు..!
వీరేందర్ అఖారాకు వెళ్లిన రాహుల్ బజరంగ్ పునియాతో పాటు ఇతర రెజ్లర్లతో కొద్దిసేపు ముచ్చటించారు. కొన్ని వ్యాయామాలు చేశారు. రాహుల్ రాకపై బజరంగ్ పునియా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తెల్లవారు జామున మా వద్దకు వచ్చారు. మా రెజ్లింగ్ రోజువారీ వ్యాయామాలు చూడటానికి వచ్చారు. రాహుల్ మాతోకలిసి రెజ్లింగ్ చేశారు. ఒక రెజ్లర్ యొక్క రోజువారీ కార్యకలాపాలను చూడటానికి వచ్చిన రాహుల్, తమతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించారని తెలిపారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) వివాదం నడుస్తుంది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. అయితే, సంజయ్ సింగ్ మాజీ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు. దీంతో రెజ్లర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. సంజయ్ ఎన్నికపై ఆవేదన వ్యక్తం చేస్తూ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. బజరంగ్ పునియా, వీరేందర్ యాదవ్ లు పద్మశ్రీ అవార్డులను వెనక్కి ఇచ్చారు. వినేశ్ ఫొగాట్ ఖేల్ రత్న, అర్జున అవార్డులను వెనక్కు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, డబ్ల్యూఎఫ్ఐ నిబంధనలు అతిక్రమించారంటూ క్రీడా మంత్రిత్వ శాఖ డబ్ల్యూఎఫ్ఐ నూతన కమిటీని రద్దు చేసింది. దీంతో సంజయ్ ఎన్నిక రద్దయింది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ బుధవారం తెల్లవారు జామున అఖారాకు వెళ్లి బజరంగ్ పునియాతోపాటు పలువురు రెజ్లర్లను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
https://twitter.com/ANI/status/1739846065938219384?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1739846065938219384%7Ctwgr%5E4ee075b2ecbb4173c7429027140be839fe7ff51c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fenglish.jagran.com%2Findia%2Frahul-gandhi-visits-akhara-in-haryana-meets-bajrang-punia-other-wrestlers-amid-wfi-row-video-watch-10123099
https://twitter.com/ANI/status/1739853732542886159?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1739853732542886159%7Ctwgr%5Edbbf76bb217fc09c398e2045032a88b51de998d1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftimesofindia.indiatimes.com%2Fsports%2Fmore-sports%2Fwrestling%2Fwatch-rahul-gandhi-meets-bajrang-punia-other-wrestlers-as-wfi-crisis-continues%2Farticleshow%2F106308561.cms
https://twitter.com/RahulGandhi/status/1739883135737950284