Ghulam Nabi Azad: ఆజాద్ రాజీనామాపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. కీలక వ్యాఖ్యలు చేసిన జైరాం రమేష్

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. శుక్రవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు గులాం నబీ ఆజాద్ ప్రకటించారు.

JaiRam Ramesh

Ghulam Nabi Azad: జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. శుక్రవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఐదు పేజీల లేఖను పంపించారు. ఆ లేఖలో పార్టీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, ఇందిరా గాంధీతో తనకున్న సన్నిహిత సంబంధాలను వివరించాడు.

CJI Justice Uday Umesh Lalit: రేపు సీజేఐగా జస్టిస్ యుయు లలిత్ బాధ్యతల స్వీకరణ.. పదవిలో ఉండేది కేవలం 74 రోజులే.. ఎందుకంటే?

ఇదిలాఉంటే ఆజాద్ సోనియాకు రాసిన లేఖలో రాహుల్ ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాహుల్ రాకతో పార్టీ పతనం మొదలైందని అన్నారు. పరిణతి లేని ఆయన నాయకత్వంతోనే తాను పార్టీ నుంచి భారమైన హృదయంతో వైదొలుగుతున్నట్లు తెలిపాడు. అయితే గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వివిధ అంశాలపై బీజేపీతో పోరాడుతున్న సమయంలో ఆజాద్ పార్టీని వీడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.

Ghulam Nabi Azad resigns: కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన గులాం నబీ ఆజాద్.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా.. రాహుల్‌పై తీవ్ర విమర్శలు

రాహుల్ గాంధీపై గులాం నబీ ఆజాద్ విమర్శలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ తప్పుబట్టారు. లేఖలో పేర్కొన్న విషయాలు వాస్తవం కాదని చెప్పారు. గులాం నబీ ఆజాద్ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బేనని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.