CJI Justice Uday Umesh Lalit: రేపు సీజేఐగా జస్టిస్ యుయు లలిత్ బాధ్యతల స్వీకరణ.. పదవిలో ఉండేది కేవలం 74 రోజులే.. ఎందుకంటే?

సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ రోజు పదవీ విరమణ చేయనున్నారు. రేపు నూతన సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ (Justice Uday Umesh Lalit) బాధ్యతలు స్వీకరించనున్నారు.

CJI Justice Uday Umesh Lalit: రేపు సీజేఐగా జస్టిస్ యుయు లలిత్ బాధ్యతల స్వీకరణ.. పదవిలో ఉండేది కేవలం 74 రోజులే.. ఎందుకంటే?

Justice Uday Umesh Lalit

CJI Justice Uday Umesh Lalit: సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ రోజు పదవీ విరమణ చేయనున్నారు. రేపు నూతన సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ (Justice Uday Umesh Lalit) బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) యుయు లలిత్ చే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 49వ సీజేఐగా లలిత్ బాధ్యతలు స్వీకరిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 65ఏళ్ల వయస్సు వరకు కొనసాగుతారు. ఈ క్రమంలో యుయు లలిత్ పదవీ కాలం నవంబర్ వరకు మాత్రమే ఉంది. అంటే ఆయన 74 రోజులు మాత్రమే సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు.

NV Ramana: నేడు పదవీ విరమణ చేయనున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా కోర్టు ప్రోసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం!

సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం కొనసాగింది జస్టిస్ కమల్ నరేన్ సింగ్. ఆయన 1991లో కేవలం 17రోజులు మాత్రమే సీజేఐగా కొనసాగారు. జస్టిస్ లలిత్ తర్వాత న్యాయవ్యవస్థకు సారథ్యం వహించే సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ తదుపరి వరుసలో ఉన్నారు.

CJI Justice Uday Umesh Lalit : సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్
జస్టిస్ యుయు లలిత్ మహారాష్ట్రకు చెందినవారు. 9 నవంబర్ 1957లో జన్మించారు. జూన్ 1983లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి డిసెంబర్ 1985 వరకు బాంబే హైకోర్టులో పనిచేశారు. అతను 2014లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందకముందు 2004 నుండి సీనియర్ న్యాయవాది. యుయు లలిత్ క్రిమినల్ లాయర్. అతని తండ్రి కూడా సీనియర్ న్యాయవాది, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి. 2019లో బాబ్రీ విధ్వంసానికి సంబంధించిన కేసులో యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ తరఫున హాజరైనందున జస్టిస్ యూయూ లలిత్ అయోధ్య కేసు నుంచి తప్పుకున్నారు. జస్టిస్ లలిత్ కూడా ట్రిపుల్ తలాక్ విధానాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడానికి అనుకూలంగా ఓటు వేశారు.