నెహ్రూకు నాయకుల ఘన నివాళులు

  • Publish Date - November 14, 2019 / 04:16 AM IST

దివంగత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా యావత్‌ దేశం ఘన నివాళి అర్పించింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ,మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,మాజీ ప్రధానమంత్రి మన్మోహణ్ సింగ్,మాజీ ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ,పులువరు నాయకులు,ప్రముఖులు న్యూఢిల్లీలోని శాంతివనంలో నెహ్రూ సమాధి దగ్నిగర ఘన నివాళులర్పించారు. ట్విటర్‌ వేదికగా జవహర్‌లాల్‌ నెహ్రూకు నివాళులు అర్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. 

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధానిగా పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 1964లో నెహ్రు చనిపోయిన తరువాత ఆయన పుట్టిన రోజైన నవంబర్‌14న చిల్డ్రన్స్‌ డే జరుపుకొంటున్నాం. స్వాతంత్య్రానికి ముందు బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అన్ని దేశాలతోపాటు నిర్వహించుకునేవాళ్లం. నవంబరు 20న చిల్డ్రన్స్ డే నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాలు తీర్మానించాయి. నెహ్రు మరణం తర్వాత నుంచి నవంబర్ 14న చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం

నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ. నెహ్రు ఎక్కడికెళ్లినా.. పిల్లలను వెతికి మరీ ఆప్యాయంగా పలకరించేవారు.  పిల్లలకు కూడా పండిట్ నెహ్రూ అంటే వల్లమానిన ప్రేమ. ఆయనని ముద్దుగా ‘చాచా నెహ్రూ’, ‘చాచాజీ’ అని పిలుచుకుంటారు.