Congress suspends Amarinder Singh's wife for anti-party activities
Preneet Kaur: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య, పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్సెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అమరీందర్ సింగ్‌ను చాలా రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, ఆయన కొత్త పార్టీ పెట్టినప్పటికీ.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో, ఆ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు.
BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
అయితే బీజేపీకి అనుకూలంగానే ప్రణీత్ కౌర్ వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో డిసిప్లినరీ యాక్షన్ కమిటీ (డీఏసీ) ఆమెకు చర్యలు దిగింది. ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ అధినేత అమరీందర్ సింగ్ రాజా పేర్కొన్నారు. కాగా ఈ విషయమై పంజాబ్ కాంగ్రెస్ స్పందిస్తూ ‘‘పాటియాలా ఎంపీ (లోక్‌సభ) ప్రణీత్ కౌర్ బీజేపీకి లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుండడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీనిపై పార్టీ రాష్ట్ర అధినేత అమరీందర్ సింగ్ రాజాకు ఫిర్యాదు అందింది. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు’’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నవంబర్ 2021లో కాంగ్రెస్ పార్టీకి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. “1954 నుంచి నేను రాజీవ్ గాంధీతో కలిసే ఉన్నాను. రాజీవ్ పిల్లల్ని కూడా నా సొంత పిల్లల్లగా చూశాను. ఇప్పటికీ వారి మీద గాఢమైన ప్రేమతోనే ఉన్నాను. కానీ ఇప్పుడు వారి ప్రవర్తనకు చాలా బాధపడ్డాను” అని రాజీనామా అనంతరం సోనియా గాంధీకి రాసిన లేఖలో అమరీందర్ పేర్కొన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ అనే పార్టీని స్థాపించారు. అయితే కెప్టెన్ కూడా గెలవలేకపోయారు. ఇక గతేడాది సెప్టెంబర్‌లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.