BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే పేరుతో బ్రిటిష్ బ్రాడ్ కాస్ట్ (బీబీసీ) తీసిన ఈ డాక్యూమెంటరీని రెండు భాగాలుగా ప్రసారం చేసింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది. కాగా, ఈ డాక్యూమెంటరీపై భారత ప్రభుత్వం సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది

BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

SC to hear pleas on BBC documentary row, asks petitioners seeking ban to mention case again

BBC Documentary: దేశంలో సంచలన సృష్టించిన బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు తాజాగా ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన ఈ డాక్యుమెంటరీని ప్రభుత్వమే అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేసింది. అనంతరం ధర్మాసనం ఈ విషయమై స్పందిస్తూ మూడు వారాల్లోగా దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్‌తో కూడిన దేశ అత్యున్న ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Akali-BSP: లోక్‭సభ ఎన్నికల్లోనూ అకాలీ-బీఎస్పీ కలిసే పోటి.. మాయావతిని కలిసి పొత్తును పొడగించిన సుఖ్బీర్

ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే పేరుతో బ్రిటిష్ బ్రాడ్ కాస్ట్ (బీబీసీ) తీసిన ఈ డాక్యూమెంటరీని రెండు భాగాలుగా ప్రసారం చేసింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది. కాగా, ఈ డాక్యూమెంటరీపై భారత ప్రభుత్వం సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అపఖ్యాతిపాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని తీవ్రంగా విమర్శించింది.

Adani Group : అదానీ.. కొంపకొల్లేరు.. కొనసాగుతున్న షేర్ల పతనం, రూ.9లక్షల కోట్లకుపైగా నష్టం

అయితే కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు.