Vidarbha State: మళ్లీ లేచిన విదర్భ వివాదం.. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ సీఎం సభలో నినాదాలు, ఇద్దరు అరెస్ట్

విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని నినాదాలు చేశారు. ఇలా నినాదాలు చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి షిండే తన ప్రసంగాన్ని కొనసాగించారు. 2013లో ఈ డిమాండ్ పెద్ద ఎత్తున కొనసాగింది. విదర్భ ప్రాంతానికి చెందిన యువకులు ఈ విషయమై పాదయాత్రలు, నిరసనలు చేశారు.

Vidarbha State: మళ్లీ లేచిన విదర్భ వివాదం.. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ సీఎం సభలో నినాదాలు, ఇద్దరు అరెస్ట్

Two men raise slogans in front of Maharashtra CM Shinde demanding 'Vidarbha state'

Updated On : February 3, 2023 / 7:55 PM IST

Vidarbha State: మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని (నాగ్‭పూర్ కేంద్రంగా తూర్పు మహారాష్ట్ర ప్రాంతం) ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏనాటి నుంచో ఉంది. అయితే చాలా కాలం క్రితం ఉదృతంగా నడిచిన ఈ డిమాండ్, రాను రాను మెత్తపడింది. ఏదో సందర్భంలో ఈ ప్రస్తావనను చర్చించడం తప్ప, పెద్ద ఎత్తున డిమాండ్ అయితే పెరగలేదు. కాగా, తాజాగా ఈ డిమాండ్ బలపడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే శుక్రవారం ఆ రాష్ట్ర వార్దా(విదర్భ ప్రాంతం)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే కార్యక్రమంలో కొందరు వ్యక్తులు ప్రత్యేక రాష్ట్ర నినాదాలు చేశారు.

Akali-BSP: లోక్‭సభ ఎన్నికల్లోనూ అకాలీ-బీఎస్పీ కలిసే పోటి.. మాయావతిని కలిసి పొత్తును పొడగించిన సుఖ్బీర్

విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని నినాదాలు చేశారు. ఇలా నినాదాలు చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి షిండే తన ప్రసంగాన్ని కొనసాగించారు. 2013లో ఈ డిమాండ్ పెద్ద ఎత్తున కొనసాగింది.

Ezri Care Artificial Tears : ఐడ్రాప్స్ కలకలం.. వాడిన వారిలో ఇన్ఫెక్షన్లు, రీకాల్ చేసిన ఇండియన్ కంపెనీ

విదర్భ ప్రాంతానికి చెందిన యువకులు ఈ విషయమై పాదయాత్రలు, నిరసనలు చేశారు. అప్పట్లో కొనసాగిన ఈ పాదయాత్రకు కాంగ్రెస్ నేత రంజీత్ దేశ్‭ముఖ్ నాయకత్వం వహించడం గమనార్హం. ఎందుకంటే ఆ సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఇక తాజాగా లేసిన డిమాండ్ ఎంత మేరకు ముందుకు వెళ్తుందో చూడాలి.

BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు