Ezri Care Artificial Tears : ఐడ్రాప్స్ కలకలం.. వాడిన వారిలో ఇన్ఫెక్షన్లు, రీకాల్ చేసిన ఇండియన్ కంపెనీ

అమెరికా నుంచి తన ఫార్మా ఉత్పత్తులను రీకాల్ చేసింది ఓ ఇండియన్ కంపెనీ. యూఎస్ నుంచి ఎజ్రీకేర్ ఐ డ్రాప్స్ ను వెనక్కి రప్పిస్తోంది చెన్నైకి చెందిన ఓ గ్లోబల్ ఫార్మా కంపెనీ. ఈ ఐడ్రాప్స్ కారణంగా ఇన్ఫెక్షన్ కు గురై పలువురు కంటి చూపును కోల్పోవడం, ఒకరి చనిపోవటంతో అప్రమత్తమైన కంపెనీ వెంటనే ఐడ్రాప్స్ ను రీకాల్ చేసింది.

Ezri Care Artificial Tears : ఐడ్రాప్స్ కలకలం.. వాడిన వారిలో ఇన్ఫెక్షన్లు, రీకాల్ చేసిన ఇండియన్ కంపెనీ

Ezri Care Artificial Tears : అమెరికా నుంచి తన ఫార్మా ఉత్పత్తులను రీకాల్ చేసింది ఓ ఇండియన్ కంపెనీ. యూఎస్ నుంచి ఎజ్రీకేర్ ఐ డ్రాప్స్ ను వెనక్కి రప్పిస్తోంది చెన్నైకి చెందిన ఓ గ్లోబల్ ఫార్మా కంపెనీ. ఈ ఐడ్రాప్స్ కారణంగా ఇన్ఫెక్షన్ కు గురై పలువురు కంటి చూపును కోల్పోవడం, ఒకరి చనిపోవటంతో అప్రమత్తమైన కంపెనీ వెంటనే ఐడ్రాప్స్ ను రీకాల్ చేసింది.

చెన్నై కంపెనీ తయారు చేస్తున్న ఈ ఆర్టిఫిషియల్ టియర్స్ ఐడ్రాప్స్ ను ఎజ్రీకేర్, ఎల్ఎల్ సీ, డెస్లమ్ ఫార్మాలు యూఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఎజ్రీకేర్ ఐడ్రాప్స్ వేసుకున్న వారు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు గురైనట్లు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తేల్చింది. దీంతో వెంటనే తమ ప్రొడక్ట్స్ ను స్వచ్చందంగా రీకాల్ చేసింది కంపెనీ.

Also Read..Pfizer Covid Mutations : కరోనా కన్నా డేంజరస్ వైరస్ మ్యుటేషన్లు తయారీ.. అమెరికా ఔషధ సంస్థ ఫైజర్ దుర్మార్గం

ఎజ్రీకేర్ ఐడ్రాప్స్ వాడిన వారిలో కొందరు శాశ్వతంగా చూపు కోల్పోయారు. ఒకరు చనిపోయారు. దీనికి రక్తప్రవాహ ఇన్‌ఫెక్షన్ కారణం అయి ఉండొచ్చని రిపోర్టులో తేలింది. డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియాతో కలుషితం కావడం కూడా కారణం కావొచ్చని అమెరికా దేశ ఆరోగ్య పరిరక్షణ ఏజెన్సీ తెలిపింది.

దీంతో యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) అలర్ట్ అయ్యింది. చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ తయారు చేసిన ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ ఐ డ్రాప్స్ ను టెస్ట్ చేస్తోంది. ఇక యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ).. ఆ కంపెనీ ఉత్పత్తుల దిగుమతులను పరిమితం చేయాలని నిర్ణయించింది.

Also Read..Small Capsule Missing: ఆస్ట్రేలియాలో ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నరేడియోధార్మిక క్యాప్సూల్.. దానిని తాకొద్దంటూ అధికారుల హెచ్చరికలు

ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ లేదా డెల్సామ్ ఫార్మా ఆర్టిఫిషియల్ టియర్స్‌ని కొనుగోలు చేయవద్దని, వాటి వాడకం వెంటనే ఆపేయాలని వినియోగదారులను ఎఫ్ డీఏ హెచ్చరించింది. కలుషితమైన ఆర్టిఫిషియల్ టియర్స్.. కంటి ఇన్ఫెక్షన్ల ముప్పుని పెంచే ప్రమాదం ఉందని, ఫలితంగా శాశ్వతంగా కంటి చూపును కోల్పోవడం లేదా మరణం సంభవించవచ్చంది.

ఈ పరిణామాలతో చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ కంపెనీ వెంటనే స్పందించింది. స్వచ్చందంగా తమ ఉత్పత్తులను అమెరికా నుంచి రీకాల్ చేసినట్లు తెలిపింది. కాగా, ఇప్పటివరకు 11 మందిలో ఇన్ఫెక్షన్లు కనిపించాయి. వారిలో 5 మంది శాశ్వతంగా కంటి చూపును కోల్పోయారని అమెరికా అధికారులు తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సూడోమోనాస్ ఎరుగినోసా.. రక్తం, ఊపిరితిత్తులు లేదా గాయాలలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కారణంగా చికిత్స చేయడం కష్టతరంగా ఉందని వైద్య నిపుణులు తెలిపారు.