Small Capsule Missing: ఆస్ట్రేలియాలో ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నరేడియోధార్మిక క్యాప్సూల్.. దానిని తాకొద్దంటూ అధికారుల హెచ్చరికలు

ఆస్ట్రేలియాలో ఓ విచిత్రమైన సమస్య పలు ప్రాంతాల ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఆ దేశంలో ఓ చిన్న క్యాప్సూల్ కనిపించకుండా పోయింది. దీంతో అధికారులు దానిని గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలు దాని జోలికి వెళ్లొద్దని, సమాచారం తెలిస్తే మాకు తెలపాలని హెచ్చరికలు జారీ చేశారు.

Small Capsule Missing: ఆస్ట్రేలియాలో ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నరేడియోధార్మిక క్యాప్సూల్.. దానిని తాకొద్దంటూ అధికారుల హెచ్చరికలు

radioactive capsule

Small Capsule Missing: ఆస్ట్రేలియాలో ఓ విచిత్రమైన సమస్య పలు ప్రాంతాల ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఆ దేశంలో ఓ చిన్న క్యాప్సూల్ కనిపించకుండా పోయింది. దీంతో అధికారులు దానిని గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలు దాని జోలికి వెళ్లొద్దని, సమాచారం తెలిస్తే మాకు తెలపాలని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు ఇంతగా ఆందోళన చెందడానికి కారణం.. కనిపించకుండా పోయిన రేడియో ధార్మికత పదార్థంలో సీజీయం-137 ఉండటమే. దీనిని మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైంది. దీనిని తాకిన వారికి కాలిన గాయాలు కావటంతో పాటు, దీర్ఘకాలిక క్యాన్సర్ వంటి వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది.

missing capsule is smaller than an Australian 10 cent coin

missing capsule is smaller than an Australian 10 cent coin

ఆస్ట్రేలియాలో పెద్ద మైనింగ్ కార్యకలాపాలను కలిగిఉన్న రియో టింటో ఇటీవలి కాలంలో వరుస వివాదాలకు కారణమవుతోంది. రిమోట్ కింబర్లీ ప్రాంతంలోని ఆ సంస్థకు చెందిన ఓ గనిలో ఈ రేడియో ధార్మిక క్యాప్సూల్ ను వినియోగిస్తారు. గని స్థలం నుంచి జనవరి 12న ప్రత్యేక వాహనంలో పెర్త్‌లోని ఈశాన్య శివారులోని నిల్వ కేంద్రానికి ఈ క్యాప్సూల్ ను తరలిస్తున్నారు. రవాణా సమయంలో ఈ క్యాప్సూల్ మిస్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ రేడియో ధార్మిక క్యాప్సూల్ 6 మి.మీల వ్యాసం, 8 మి.మీల పొడవు కలిగి ఉంటుంది. ఇది జనవరి 25న గమ్యస్థానానికి చేరాల్సి ఉంది. ప్రమాదకరమైన రేడియో ధార్మిక క్యాప్సూల్ మిస్ కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొత్తం 14వేల కి.మీల మేర వెతుకులాట కొనసాగిస్తున్నారు. అయినా ఇది కనిపించక పోవటంతో ప్రజలను అప్రమత్తం చేశారు. క్యాప్సూల్ చిత్రాలను విడుదల చేశారు.

 

బఠానీ పరిమాణంలో ఉండే దీనికోసం అధికారులు పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఈ రేడియో ధార్మిక క్యాప్సూల్ ను ఎట్టిపరిస్థితుల్లో తాకొద్దని, దానిని గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. దీనిని తాకడం వల్ల వెంటనే కాలిన గాయాలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం హెచ్చరించింది. క్యాప్సూల్ కు సంబంధించిన ఫొటోలనుసైతం అధికారులు విడుదల చేశారు. ఎవరికైన కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, ఒకవేళ ఎవరైనా వాటిని తాకినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు.