Congress to hold mass protest rally
Congress to hold mass protest rally: దేశంలో పెరిగిపోతోన్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, జీఎస్టీ వంటి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రేపు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిరసన తెలపనుంది. కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడతామని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఇతర నేతలు ప్రసంగించనున్నారు. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతలు వచ్చి ఈ నిరసన ర్యాలీలో పాల్గొంటారు. సెప్టెంబరు 7 నుంచి కాంగ్రెస్ పార్టీ ‘‘భారత్ జోడో యాత్ర’’ పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు (3,500 కిలోమీటర్ల మేర) యాత్రను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
ఆ యాత్రకు ముందు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిరసన తెలుపుతుండడం గమనార్హం. సోనియా గాంధీ చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్ళారు. సోనియాతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, ఆమె కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఉన్నారు. సోనియా, ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ నిరసనలో పాల్గొనే అవకాశం లేదు. రాహుల్ గాంధీ మాత్రం ఇవాళ తిరిగి భారత్ రానున్నారు. ఆయన కాంగ్రెస్ నిర్వహిస్తోన్న యాత్రలో పాల్గొంటారు.
Rains in telangana: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం