Bharat Jodo Yatra: అందుకే భారత్ జోడో యాత్రను ఆపాలని కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది: కాంగ్రెస్

''కాంగ్రెస్ చేస్తున్న భారత్ జోడో యాత్ర గురించి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే పలు ఆదేశాలు జారీ చేస్తోంది.. లేఖలను పంపుతోంది’’ అని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కరోనా నిబంధనలు పాటిస్తుందని, అయితే, భారత్ జోడో యాత్రను మాత్రం ఆపదని తెలిపారు.

Bharat Jodo Yatra: ‘‘కాంగ్రెస్ చేస్తున్న భారత్ జోడో యాత్ర గురించి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే పలు ఆదేశాలు జారీ చేస్తోంది.. లేఖలను పంపుతోంది’’ అని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కరోనా నిబంధనలు పాటిస్తుందని, అయితే, భారత్ జోడో యాత్రను మాత్రం ఆపదని తెలిపారు.

దేశంలోనూ కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండడంతో భారత్ జోడో యాత్రను ఆపేయాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై సల్మాన్ ఖర్షీద్ స్పందిస్తూ… కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని, అంతేగానీ, యాత్రను నిలిపేయబోమని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పార్టీకి, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటుందని చెప్పారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక మేరకే రాహుల్ గాంధీ పాదయాత్ర జనవరి 3న ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశిస్తుందని స్పష్టం చేశారు. కాగా, పలు దేశాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ రాజస్థాన్ లో జన్ ఆక్రోశ్ యాత్రను నిలిపి వేసింది. తమకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని చెప్పుకొచ్చింది.

Maharashtra: వీఐపీ సెక్యూరిటీకి నిర్భయ నిధులు.. అబ్బబ్బే, ఇది ఉద్ధవ్ సర్కార్ పనే అంటున్న ఫడ్నవీస్

ట్రెండింగ్ వార్తలు