కేంద్రంలో అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు.. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కీలక హామీలు

"పాంచ్ న్యాయ్" పేరుతో 5 అంశాలతో ముసాయిదా మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని..

Congress Manifesto 2024: కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీయిచ్చింది. “పాంచ్ న్యాయ్” పేరుతో 5 అంశాలతో ముసాయిదా మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ముసాయిదా మ్యానిఫెస్టోను ఆమోదించారు. తుది మ్యానిఫెస్టోను విడుదల చేసే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు కట్టబెడుతూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. భేటీ అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మూడు రోజుల్లో 30 వేల ఉద్యోగాలు కల్పించామని, తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తున్నామని తెలిపారు.

ముసాయిదా మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు..

హిస్సేదారి న్యాయ్:
1. సామాజిక, ఆర్థిక కుల గణన
2. ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ల కల్పనపై 50% సీలింగ్ తొలగింపు
3. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్
4. జల్ జంగల్ జమీన్ పై చట్టబద్ధహక్కులు
5. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాలో గుర్తింపు

కిసాన్ న్యాయ్ :
1. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్ధత
2. రుణమాఫీ కమిషన్ ఏర్పాటు
3. పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారెంటీ
4. రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం
5. వ్యవసాయ పరికరాలపై జిఎస్టి మినహాయింపు

శ్రామిక్ న్యాయ్ :
1. రైట్ టు హెల్త్ చట్టం
2. రోజుకు 400 రూపాయల కనీస వేతనం- ఉపాధి హామీ పథకంలో సైతం
3. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు
4. అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా యాక్సిడెంట్ బీమా
5. ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు నిలుపుదల

యువ న్యాయ్:
1. కేంద్రాన్ని ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ
2. యువతకు ఏడాది అప్రెంటిస్ట్ షిప్ – ఏడాదికి లక్ష రూపాయలు, నెలకు 8500 చెల్లింపు
3. పేపర్ లీక్ అరికట్టేందుకు కఠినమైన చట్టం
4. గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు
5. యువత స్టార్టప్ కోసం ఐదు వేల కోట్ల నిధి కేటాయింపు

Also Read: ఎన్నికల వేళ భారత్ ఎటువైపు? దేశంలోని ప్రధాన నేతలు, వారి మైనస్ పాయింట్లు ఇవే..

నారీ న్యాయ:
1. ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు
3. ఆశ అంగన్వాడి మిడ్ డే మీల్ వర్కర్స్కు డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్
4. మహిళల హక్కుల రక్షణ కోసం అధికారి మైత్రి ఏర్పాటు
5. వర్కింగ్ విమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో రెట్టింపు హాస్టల్స్

ట్రెండింగ్ వార్తలు