CWC Meeting : అక్బర్ రోడ్ బ్లాక్.. గాంధీలు రాజీనామా చేయొద్దంటూ నినాదాలు

సమావేశానికి 57 మందికి ఆహ్వానం అందింది. సమావేశానికి సీనియర్ కాంగ్రెస్ లీడర్లు, ఐదు రాష్ట్రాల ఇంచార్జ్లు, ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. అందుబాటులో లేని సభ్యులు

Aicc

Congress Working Committee : ఢిల్లీ పోలీసులు అక్బర్ రోడ్డును బ్లాక్ చేశారు. ఈ రోడ్ వద్దకు గాంధీ కుటుంబ మద్దతు దారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు రాజీనామాలు చేయవద్దంటూ యూత్ కాంగ్రెస్ లీడర్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయం ముందు వీరు నిలబడి నినాదాలు చేశారు. సీడబ్ల్యూసీ సమావేశానికంటే ముందు వీరు పార్టీ పదవులకు రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆదివారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో జరుగుతున్న పార్టీ కార్యాలయం వద్దకు గాంధీ మద్దతు దారులు చేరుకున్నారు.

Read More : Congress : సీడబ్ల్యూసీ సమీక్ష స్టార్ట్.. నాయకత్వ మార్పు ఉంటుందా ?

సీడబ్ల్యూసీ (CWC) సమావేశానికి 57 మందికి ఆహ్వానం అందింది. సమావేశానికి సీనియర్ కాంగ్రెస్ లీడర్లు, ఐదు రాష్ట్రాల ఇంచార్జ్లు, ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. అందుబాటులో లేని సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతున్నారు. G23 నేతల్లో పలువురు హాజరయ్యారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ లు కూడా హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీలో ఎన్నికల ఫలితాలపై చర్చిస్తున్నారు.

Read More : AICC : ఎక్కడ తప్పు జరిగింది ?.. సీడబ్ల్యూసీ మీటింగ్, టైం ఫిక్స్

జీ 23 గ్రూప్‌ నేతలు.. నాయకత్వ మార్పు కోరుకుంటుంటే గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉండే వారంతా రాజీనామాల అవసరం లేదని చెబుతున్నారు. జీ 23 గ్రూపు నేతలు విరుచుకుపడితే తిప్పికొట్టేందుకు అన్ని స్థాయిల్లోనూ రాహుల్ సన్నిహిత నేతలు సిద్ధమయ్యారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని రాహుల్ గాంధీని పలువురు నేతలు కోరనున్నారు. తాత్కాలికంగా మరో సీనియర్ నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పడం మంచిందని మరికొందరు నేతలు వెల్లడిస్తున్నారు. యూపీలో ప్రియాంక పూర్తిగా రంగంలోకి దిగినా….ఘోర పరాజయం తప్పలేదు. ఇక పంజాబ్‌లో రాహుల్ గాంధీ సుడిగాలి ప్రచారం చేసినా అధికారానికి దూరమైంది. ఇక మిగతా రాష్ట్రాల్లో కోలుకోలేని స్థితికి చేరింది. దీంతో మీటింగ్ లో ఏం కీలక నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ నెలకొంది.