Cylinders Blast: బీహార్‌లో వరుసగా పేలిన సిలిండర్లు.. భయంతో వణికిపోయిన స్థానికులు.. అసలేం జరిగిందంటే..

బీహార్‌లోని భాగల్‌పూర్ ప్రాంతం పేలుళ్ల మోతతో దద్దరిల్లి పోయింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా భారీ శబ్ధాలతో మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వరుసగా 30 నుంచి 35 సిలిండర్లు పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.

Cylinders Blast: బీహార్‌లో వరుసగా పేలిన సిలిండర్లు.. భయంతో వణికిపోయిన స్థానికులు.. అసలేం జరిగిందంటే..

Cylinders Blast

Updated On : December 14, 2022 / 9:15 AM IST

Cylinders Blast: బీహార్‌లోని భాగల్‌పూర్ ప్రాంతం పేలుళ్ల మోతతో దద్దరిల్లి పోయింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా భారీ శబ్ధాలతో మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుళ్ల ఘటన నారాయణపూర్ లోని భవానీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి సమయంలో సిలిండర్ల లోడుతో ట్రక్కు వెళ్తుంది. ఈ ట్రక్కులో సిలిండర్లు ఉన్నట్లుండి ఒక్కొక్కటిగా పేలడం ప్రారంభించాయి. దీంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. అర్థరాత్రి వేళ 2.30 నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

LPG Cylinder Blast: ఎల్పీజీ సిలిండర్ పేలి నలుగురు మృతి.. 16 మందికి గాయాలు

రాత్రివేళ అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ పేలుళ్ల ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందోనని బయటకు వచ్చిచూసే సరికి కొద్దిదూరంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు కనిపించాయి. వీటిని వీడియోలు తీసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ఈ పేలుళ్లు జరిగిన కొద్దిదూరంలోనే పెట్రోల్ బంక్ ఉంది. దీనికి మంటలు వ్యాపించక పోవటంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఎన్‌హెచ్ – 31లో ఈ ఘటన జరిగిన తర్వాత ఇరువైపులా రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రక్కులో సుమారు 30 నుంచి 35 వరకు సిలిండర్లు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు.

పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ట్రాఫిక్ ను క్రబబద్దీకరించారు. నాలుగు ఫైర్ ఇంజన్లు సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. భాగల్ పూర్ – ఖగారియా సరిహద్దులోని ఎన్‌హెచ్-31లో ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఢీపీవో దిలీప్ కుమార్ తెలిపారు. ట్రక్కులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలాయిని అన్నారు. భారీ పేలుళ్లతో పక్కనే ఉన్న రైతులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పశువులతో పరుగులు తీశారు. ఎక్కడో బాంబు పేలుడు జరిగినట్లు తొలుత భావించామని చెప్పారు. కొంత సేపటికి గ్యాస్ సిలిండర్లు పేలినట్లు గుర్తించారు. పేలుడు ఘటన తర్వాత బుధవారం తెల్లవారు జామున రోడ్డుపై అనేక సిలిండర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ట్రక్కు డ్రైవర్ ముంగేర్ లోని శంకర్‌పూర్ గ్రామానికి చెందిన మంటూ యాదవ్ గా గుర్తించారు.