Container truck drags car for 2 km on Pune-Ahmednagar highway
Pune-Ahmednagar Highway: ఒక కారును కంటైనర్ ఢీ కొట్టింది. అలా ఢీ కొట్టిన అనంతరం సుమారు రెండు కిలోమటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అయినా కారులో ఉన్నవారికి ఏమీ కాకపోవడం గమనార్హం. మహారాష్ట్రలోని పూణెకి సమీపంలో ఉన్న శికరపూర్ వద్ద ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన. స్థానిక పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. పూణె-అహ్మద్‌నగర్ హైవేపై శనివారం రాత్రి ఒక కంటైనర్ స్పీడుగా వచ్చి ముందుకు వెళ్తున్న కారును ఢీ కొట్టి రెండు కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది.
కారు రోడ్డుకు తాకుతూ పోవడంతో నిప్పు రవ్వలు విరజిమ్మాయి. అవి కారును చుట్టుముట్టాయి. చుట్టు పక్కల ఉన్నవారు ఆశ్చర్యంతో భయాందోళనతో చూస్తున్నారు. లోపల ఉన్నవారి పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. రెండు కిలోమీటర్ల తర్వాత లారీ-కారు ఆగాయి. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు క్షేమంగా కారు నుంచి దిగడంతో చూస్తున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రోడ్డు పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.