రోడ్లపై వాహనాలు దూసుకెళ్తున్నాయి. నడిరోడ్డులో నిలబడి ట్రాఫిక్ పోలీసు వాహనాలను అదుపు చేస్తున్నాడు. ఇంతలో ఓ రెడ్ కారు అటుగా దూసుకొచ్చింది.
గుర్గావ్: రోడ్లపై వాహనాలు దూసుకెళ్తున్నాయి. నడిరోడ్డులో నిలబడి ట్రాఫిక్ పోలీసు వాహనాలను అదుపు చేస్తున్నాడు. ఇంతలో ఓ రెడ్ కారు అటుగా దూసుకొచ్చింది. ట్రాఫిక్ నిబంధనలు అత్రికమించిన ఆ కారును ఆపేందుకు పోలీసు యత్నించాడు. అయినా ఆ కారు ఆగలేదు. అడ్డంగా నిలబడిన ట్రాఫిక్ పోలీసును అమాంతం లాక్కెళ్లింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. గుర్గావ్ లోని బనోట్ జిల్లాలో చోటుచేసుకుంది.
ట్రాఫిక్ పోలీసును రెడ్ కారు లాక్కెళ్తుండగా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అదృష్టవశాత్తూ పోలీసుకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.