Monsoon : దూసుకెళ్తున్న రుతుపవనాలు, దేశంలో 80 శాతం వ్యాపించేశాయి.. 62 ఏళ్ల తర్వాత ఇలా..

Monsoon : నైరుతి రుతుపవనాల రాకతో దేశంలోని అనేక నగరాలు భారీ వర్షాలు, వరద లాంటి పరిస్థితిని చూస్తున్నాయి.

Monsoon – IMD : రుతుపవనాల రాక కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రుతుపవనాలు దేశమంతా వ్యాపించి, సమృద్ధిగా వానలు కురుస్తాయా అని అటు ప్రజలు, ఇటు రైతులు వెయిట్ చూస్తున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ(IMD) సీనియర్ శాస్త్రవేత్త గుడ్ న్యూస్ (Good News) చెప్పారు.

ఊహించని రీతిలో నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నరేశ్ కుమార్ చెప్పారు. రుతుపవనాలు దేశవ్యాప్తంగా దాదాపు 80 శాతం వ్యాపించినట్లు ఆయన తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రుతుపవనాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వేగంగా చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు. రుతుపవనాలు ఆదివారం రోజు ఢిల్లీ, ముంబైకి చేరుకున్నాయన్నారు. దాదాపు 62ఏళ్ల తర్వాత ఇది జరిగిందన్నారు.

వాస్తవానికి జూన్ 11న ముంబైకి, జూన్ 27న ఢిల్లీకి రుతు ప‌వ‌నాలు విస్త‌రిస్తుంటాయి. అయితే, ఈసారి ఆ రెండు న‌గ‌రాల‌కు ఒకే రోజున రుతుప‌వ‌నాలు చేరుకున్న‌ాయి. ఈ ఏడాది కొత్త విధానంలో రుతుప‌వ‌నాలు దేశం మొత్తం విస్త‌రించిన‌ట్లు డాక్టర్ నరేశ్ వెల్ల‌డించారు. ఇక, అస్సాంలో ప్ర‌స్తుతం మేఘాలు వీడాయ‌ని, ఫలితంగా అక్కడ వ‌ర్ష‌పాతం ఇప్పుడు త‌క్కువ‌గా న‌మోదు అవుతుందని వెల్లడించారు. రుద్ర‌ప్ర‌యాగ్‌తో పాటు ఉత్త‌రాఖండ్‌లోని ఇత‌ర ప్రాంతాల్లో దాదాపు 12 సెంటీమీట‌ర్ల వ‌ర్షపాతం న‌మోదు కానున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Also Read..BRS Expansion: స‌ర్వే సంస్థల నివేదిక‌ల ఆధారంగా.. జాతీయస్థాయిలో కేసీఆర్ పకడ్బందీ స్కెచ్‌!

సాధారణంగా, రుతుపవనాలు అల్పపీడన జోన్ ద్వారా సక్రియం చేయబడతాయన్నారు. అల్పపీడన జోన్ వల్ల ఏర్పడే అధిక వేగం గాలులతో రుతుపవనాలు వేగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నాయన్నారు. రుతుపవనాలు మహారాష్ట్ర మీదుగా ఉన్నప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో వాటి కదలికలో మరింత వేగం పెరిగిందన్నారు. దీని ఫలితంగా ముంబైతో సహా మహారాష్ట్రలో వర్షాలు కురిశాయని, అదే సమయంలో అల్పపీడన జోన్ ఢిల్లీతో సహా వాయువ్య భారతదేశం వైపు గాలులు వీచిందని, రెండు ప్రాంతాలను ఒకేసారి కవర్ చేసిందని డాక్టర్ కుమార్ చెప్పారు. నైరుతి రుతుపవనాల రాకతో దేశంలోని అనేక నగరాలు భారీ వర్షాలు, వరద లాంటి పరిస్థితిని చూస్తున్నాయి.

పంజాబ్, హర్యానాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాను ఆకస్మిక వరదలు తాకాయి. 200 మందికి పైగా ప్రజలు, వారిలో చాలా మంది పర్యాటకులు చిక్కుకుపోయారు.

Also Read..AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో రెండు రోజులు వర్షాలు, సముద్రంలో అల్లకల్లోలం