AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో రెండు రోజులు వర్షాలు, సముద్రంలో అల్లకల్లోలం
సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

AP Rains
Moderate Rains : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఏపీలో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
Telangana Heavy Rains : రానున్న ఐదు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. 8 జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో జూన్ 29వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Himachal Pradesh Floods: బాగిపుల్ ప్రాంతాన్ని ముంచెత్తిన వరదలు.. చిక్కుకున్న 200 మంది స్థానికులు..
మరోవైపు రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది.