Himachal Pradesh Floods: బాగిపుల్ ప్రాంతాన్ని ముంచెత్తిన వరదలు.. చిక్కుకున్న 200 మంది స్థానికులు..

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా బాగిపుల్ ప్రాంతంలో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో పర్యాటకులతో పాటు స్థానికులు 200 మందికిపైగా చిక్కుకున్నారు.

Himachal Pradesh Floods: బాగిపుల్ ప్రాంతాన్ని ముంచెత్తిన వరదలు.. చిక్కుకున్న 200 మంది స్థానికులు..

Himachal Pradesh

Updated On : June 26, 2023 / 1:08 PM IST

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా బాగిపుల్ ప్రాంతంలో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో పర్యాటకులతో పాటు స్థానికులు 200 మందికిపైగా చిక్కుకున్నారు. మండి జిల్లా పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. బాగిపుల్ ప్రాంతంలో ప్రషార్ సరస్సు సమీపంలో వరదల సంభవించాయి. పర్యాటకులు, స్థానికులతోసహా 200 మందికిపైగా ప్రజలు మండి ప్రశార్ రోడ్డులోని బగ్గీ వంతెన సమీపంలో చిక్కుకుపోయారు. ఈ ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. చంబా నుంచి వచ్చిన విద్యార్థుల బస్సు, పరాశర్ నుండి తిరిగి వస్తున్న అనేక వాహనాలు చిక్కుకున్నాయని పోలీసులు తెలిపారు.

Assam Floods:22 జిల్లాలను ముంచెత్తిన వరదలు..5లక్షల మంది తరలింపు

ఆకస్మిక వరదలు కారణంగా కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్ – మనాలి హైవే మూసుకుపోవడంతో హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని ఔట్ సమీపంలో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని అధికారులు సోమవారం తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హిమాచల్‌లోని కాంగ్రా సిటీలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మండి – జోగిందర్ నగర్ హైవేకూడా మూసివేయబడింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ఈ రహదారులపై ప్రయాణించే సాధారణ ప్రజలు, పర్యాటకులు పర్వాతాలకు ఆనుకొని ఉన్న రోడ్లపై ఉండరాదని పోలీసులు తెలిపారు.

 

గడిచిన 24 గంటల్లో మండిలో 64.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కాంగ్రాలోని ధర్మశాలలో 106.6 మిల్లీ మీటర్లు వర్షం కురిసింది. కటౌలా 74.5, గోహర్ 67 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. పాలంపూర్ లో 32.2 మీటర్ల వర్షం కురిసిందని జూన్ 27, 28 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతారణ శాఖ అధికారులు తెలిపారు.