ప్రధాని మోడీకి సూర్యగ్రహణం కనిపించలేదట.!

  • Publish Date - December 26, 2019 / 07:22 AM IST

ఈరోజు సూర్య గ్రహణం సంభవించింది. దీన్ని చూసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపారు. ఈ అరుదైన సూర్యగ్రహణాన్ని చూసేందుకు ప్రధాని నరేంద్రమోడీ కూడా యత్నించారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ప్రధాని మోడీకి సూర్యగ్రహణం కనిపించలేదట. దీనికి సంబంధించిన ఆసక్తికర ఫొటోలను ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ షేర్ చేసుకున్నారు.

ప్రస్తుతం కేరళలోని కోజికోడ్ లో ప్రధాని ఉన్న ప్రధాని సూర్యగ్రహం గురించి మాట్లాడుతూ.. ఎంతో మంది భారతీయుల మాదిరే తాను కూడా ఉత్సాహంగా గ్రహణాన్ని వీక్షించానని చెప్పారు. కానీ మేఘాలు అడ్డు వచ్చాయని..దీంతో తాను సూర్య గ్రహణాన్ని సంపూర్ణంగా చూడలేకపోయానని తెలిపారు. కానీ.. గ్రహణం గురించి స్పెషలిస్టుల ద్వారా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నానని చెప్పారు.వారు చక్కగా అన్ని విషయాలు వివరించారని తెలిపారు.