Corona Cases : దేశంలో ఒకేరోజు 35 శాతం పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నాలుగు రోజుల క్రితం వరకు 10 వేలకు దిగువన నమోదైన కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Corona 11zon

Corona Cases : దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నాలుగు రోజుల క్రితం వరకు 10 వేలకు దిగువన నమోదైన కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం 13 వేలకు పైగా కేసులు నమోదు కాగా, శుక్రవారం 16,764 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇవాళ అమాంతం ఆ సంఖ్య పెరిగిపోయింది.. ఏకంగా 22 వేలను దాటేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,775 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

చదవండి : Omicron Variant : గుబులు పుట్టిస్తున్న ఒమిక్రాన్.. శనివారం ఉదయానికి 1,431 కేసులు

కరోనాతో చికిత్స పొందుతూ 406 మంది మరణించారు. ఇక ఇదే సమయంలో 8,949 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలున్నారు. తాజాగా నమోదైన కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,04,781 చేరింది. రివకరీ రేటు 98.32 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. నిన్నటికి ఈ రోజుకి కేసుల సంఖ్య 35 శాతం పెరిగింది. ఇక ఒమిక్రాన్ కేసులు పెరుగుదల చాలా వేగంగా, పెద్ద సంఖ్యలో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ సెంటిస్ట్ సౌమ్య స్వామినాథన్.. భారత్ దేశం ఓ పెద్ద సవాల్ ను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారామె.

చదవండి : Corona Compensation : మీ డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ ఫోన్.. బిత్తరపోయిన మహిళ