Corona Rising in India: ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్: పరిస్థితిపై డీడీఎంఏ సమీక్ష

దేశ రాజధాని ఢిల్లీలో అయితే కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుంటే ఉన్నాయి. యక్టీవ్ కేసుల సంఖ్య 1729కి చేరింది

Corona Rising in India: దేశంలో కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తుంది. ఏప్రిల్ 17 – 19 మధ్య రెండు రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుంటే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 501 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో యక్టీవ్ కేసుల సంఖ్య 1729కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివ్ రేటు 7.72 శాతానికి చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో మొత్తం 18,69,051 కోవిడ్ కేసులు, నమోదు కాగా 26,160 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు. చివరగా ఫిబ్రవరి 27న ఢిల్లీలో గరిష్టంగా 484 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కోవిడ్ పరిస్థితులను ఢిల్లీ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుంది.

Also read:PM Narendra Modi: రెండో రోజు గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ: అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) బుధవారం సమీక్షాసమావేశం నిర్వహించనున్నారు. మాస్క్ తప్పనిసరి చేయడం, బహిరంగ ప్రాంతల్లో మాస్క్ ధరించకపోతే రూ. 500 జరిమానా వంటి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఢిల్లీలో కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతో పాటు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, విధానాన్ని అమలు చేయనున్నారు. కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీ పరిధిలోని అన్ని ఆసుపత్రులను ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఢిల్లీ ఆసుపత్రుల్లో వేల సంఖ్యలో కోవిడ్ బెడ్లు, ఐసీయూ బెడ్లను సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. కావాల్సిన మందులు,ఆక్సిజన్ సదుపాయాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆసుపత్రులను అప్రమత్తం చేసింది.

Also read:Telangana Corona Latest Bulletin : తెలంగాణలో కొత్తగా 20 కరోనా కేసులు

విద్యాసంస్థల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఇప్పటికే ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ ప్రభుత్వం. నోయిడాలో గడిచిన 24 గంటల్లో 19 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధరణ అయింది. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో పక్కనే ఉన్న రాష్ట్రాలు సైతం అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాక్షిక ఆంక్షలు విధించగా..చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ సైతం ఆంక్షలు విధించే యోచనలో ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని 6 జిల్లాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది యుపి ప్రభుత్వం. గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బులంద్‌షహర్, బాగ్‌పత్‌ లో మాస్క్ తప్పనిసరి చేశారు.

Also read:AP Corona Bulletin : ఏపీలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదు

ట్రెండింగ్ వార్తలు