Telangana Corona Latest Bulletin : తెలంగాణలో కొత్తగా 20 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13వేల 272 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 20 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona Latest Bulletin)

Telangana Corona Latest Bulletin : తెలంగాణలో కొత్తగా 20 కరోనా కేసులు

Telangana Covid Report

Telangana Corona Latest Bulletin : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13వేల 272 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 20 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 35 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

నేటివరకు రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,111 గా ఉంది. రాష్ట్రంలో ఇంకా 189 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 91వేల 650 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 87వేల 350 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 9వేల 546 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 11 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.(Telangana Corona Latest Bulletin)

కాగా, దేశంలో మళ్లీ కరోనా అలజడి చెలరేగింది. తగ్గిందనుకున్న మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. దేశంలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు వెయ్యికి దగ్గర్లో నమోదైన కొత్త కేసులు.. ఆదివారం ఏకంగా 2 వేల మార్కు దాటేశాయి. మరోవైపు మరణాలు కూడా 200కు పైగా నమోదయ్యాయి. ఒక్కరోజే కొత్త కేసుల్లో 90శాతం పెరుగుదల నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.

India Covid : కేసులు పెరుగుతున్నాయి.. మాస్క్ కంపల్సరీ, ఆదేశాలు జారీ

ఇక దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. అక్కడి పరిసర ప్రాంతాల్లో 15 రోజుల్లోనే కొవిడ్ వ్యాప్తి 500 శాతం పెరిగినట్లు ఓ సర్వేలో వెల్లడైంది.

ఆదివారం 2.6 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2వేల 183 మందికి పాజిటివ్ గా తేలింది. ముందురోజు 1,150గా ఉన్న కేసుల సంఖ్య తాజాగా 90 శాతం మేర పెరగడం గమనార్హం. కేరళ (940), ఢిల్లీ (517)లోనే పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకూ 4.30 కోట్లమందికి వైరస్ సోకింది.

అదే సమయంలో 24 గంటల వ్యవధిలో మరో 214 మంది కోవిడ్ తో మరణించారు. అందులో కేరళ నుంచి వచ్చినవే 213. ఇంకొకటి ఉత్తరప్రదేశ్‌లో నమోదైంది. నిన్న మరో 1,985 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 11వేల 542కు చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో రికవరీల వాటా 98.76 శాతంగా ఉండగా.. క్రియాశీల కేసులు 0.03 శాతంగా ఉన్నాయి.

నిన్న 2.66 లక్షల మందే టీకా తీసుకున్నారు. 18 ఏళ్లు పైడిన అందరికీ ప్రికాషనరీ డోసు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టీకా కార్యక్రమం కింద మొత్తం మీద 186 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

India Corona: భారత్‌లో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 90శాతం పెరుగుదల.. ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా..

ఢిల్లీలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా.. భయపడాల్సిన పని లేదంటున్నారు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌. కొత్త కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరేవారి రేటు తక్కువగానే ఉందన్నారు. అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీలో పరిస్థితిని తమ ప్రభుత్వం గమనిస్తోందని చెప్పారు. మాస్క్‌ ధరించకపోతే జరిమానాను ఇటీవల ఉపసంహరించుకున్నప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మాస్కులు ధరించని వారికి జరిమానాను మళ్లీ విధించే అంశంపై బుధవారం జరిగే ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (డీడీఎంఏ) సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది.