India Covid : కేసులు పెరుగుతున్నాయి.. మాస్క్ కంపల్సరీ, ఆదేశాలు జారీ

దేశ రాజధాని పరివాహక ప్రాంతం పరిధిలోని ఆరు జిల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని ఆదేశించింది....

India Covid : కేసులు పెరుగుతున్నాయి.. మాస్క్ కంపల్సరీ, ఆదేశాలు జారీ

Face Mask

Uttar Pradesh Corona : మరోసారి కరోనా విరుచుకపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా కేసులు అధికమౌతున్నాయి. వెయి లోపే నమోదైన కోవిడ్ కేసులు ఆదివారం ఏకంగా 2000 మార్కును దాటింది. 200 మరణాలు సంభవించడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. వివిధ రాష్ట్రాలను అలర్ట్ చేసింది. అందులో భాగంగా మాస్క్ కంపల్సరీ చేసింది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో గతంలో కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదు కావడంతో నిబంధనలు సడలించింది. కానీ.. తాజాగా కేసులు పెరుగుతుండడంతో యూపీ సర్కార్ అప్రమత్తమైంది. లక్నోతో పాటు దేశ రాజధాని పరివాహక ప్రాంతం పరిధిలోని ఆరు జిల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని ఆదేశించింది.

Read More : India Corona: భారత్‌లో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 90శాతం పెరుగుదల.. ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా..

కొత్తగా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. లక్నోతో పాటు ఘజియాబాద్, హాపూర్, మీరట్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్ షార్, బాగ్పాట్ జిల్లాల్లో ఈ నిబంధన అమల్లో ఉంటుందన్నారు. గౌతమ్ బుద్ధ నగర్ లో 65, ఘజియాబాద్ లో 20, లక్నో లో 10 చొప్పున కేసులు వెలుగు చూశాయి. ఇక భారతదేశ విషయానికి వస్తే.. ఆదివారం 2.6 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు చేయగా.. 2 వేల 183 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇందులో అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 940 కేసులు వచ్చాయి. ఢిల్లీలో 517 కేసులు బయటపడ్డాయి. 2114 మరణాల్లో కేరళ నుంచే 213 మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.