India Corona: భారత్‌లో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 90శాతం పెరుగుదల.. ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా..

భారత్ లో ఫోర్త్ వేవ్ మొదలైందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అందుకు గణాకాంలు కూడా తొడవుతుండటంతో రాబోయే కాలంలో కరోనా ఫోర్త్ వేవ్ ను ఎదుర్కోక తప్పదన్న...

India Corona: భారత్‌లో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 90శాతం పెరుగుదల.. ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా..

Corona Virus

India Corona: భారత్‌లో ఫోర్త్ వేవ్ మొదలైందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అందుకు గణాంకాలు కూడా తోడవుతుండటంతో రాబోయే కాలంలో కరోనా ఫోర్త్‌వేవ్‌ను ఎదుర్కోక తప్పదన్న వాదన వినిపిస్తుంది. ఇప్పటికే చైనాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్లతో విజృంభిస్తుంది. ఆ దేశంలో సుమారు 80 నగరాల్లో లాక్ డౌన్ కొనసాగుతుంది. తాజాగా మరణాలు కూడా నమోదవుతున్నాయి. దీంతో చైనా అతలాకుతలం అవుతుంది. రాబోయే రోజుల్లో భారత్‌లోనూ ఇవే పరిస్థితులు పునరావృతం అవుతాయన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది. భారత్ లో రోజురోజుకు కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతుంది. నిన్నటివరకు దేశంలో వెయ్యిలోపే పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య ఉంది. తాజాగా సోమవారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం 2,183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Delhi covid cases : ఢిల్లీలో కోరలు చాస్తున్న కరోనా.. లోకల్ సర్కిల్స్ సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు ..

భారత్ లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. వెయ్యి లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఆదివారం 2.6లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 2,183 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంతకు ముందురోజు శనివారం 1,150 గా ఉన్న కేసుల సంఖ్య ఒక్కరోజులోనే 90శాతం మేర పెరగడం కలకలం రేపుతోంది. గడిచిన 24గంటల్లో 214 మంది కొవిడ్ భారిన మృతిచెందారు. క్రియాశీలక కేసులు 11,542 కు చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో రికవరీ వాటా 98.76 శాతంగా ఉండగా, క్రియాశీల కేసులు 0.03 ఉన్నాయి.

Delhi Covid Cases : ఢిల్లీలో కొత్తగా 461 కరోనా కేసులు.. 2 మరణాలు.. 26శాతంగా పాజిటివిటీ రేటు

ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గణాంకాల ప్రకారం చూస్తే.. భారత్ లో 2,183 పాజిటివ్ కేసులు నమోదైతే అందులో కేరళ రాష్ట్రంలో 940, ఢిల్లీలో 517 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో మరణించిన వారి వివరాలను చూస్తే.. 241 మంది మృతి చెందగా ఒక్క కేరళ రాష్ట్రంలోనే 213 మంది మృతి చెందారు. ఢిల్లీలో భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలను చేపడుతుంది. ఇదిలాఉంటే పిల్లల్లో కొవిడ్ లక్షణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో కొవిడ్ కేసులు నమోదైతే వెంటనే పాఠశాలలను మూసివేయాలని పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు కేరళ ప్రభుత్వంసైతం కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు దృష్టి కేంద్రీకరించింది. కొవిడ్ వ్యాప్తి పెరగకుండా చర్యలు తీసుకుంటుంది. కొవిడ్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో రాబోయే కాలంలో భారత్ లో ఫోర్త్ వేవ్ కష్టాలు తప్పవా అన్న ఆందోళన ప్రజల నుంచి వ్యక్తమవుతుంది.